కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
కుంటముక్కలలో రూ.1.32 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, (కుంటముక్కల), 21.07.2025.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం- ఛత్తీస్గఢ్ 30వ నంబరు జాతీయ రహదారి వద్ద నుంచి కుంటముక్కల క్రాస్ రోడ్డు నుంచి కుంటముక్కల గ్రామంలోకి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.1.32 కోట్లు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుంతలు లేని రహదారులుగా చాలా వరకు రోడ్లను అభివృద్ధి చేసిందన్నారు. మైలవరం నియోజకవర్గంలో కూడా రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు.
పలు చోట్ల నూతనంగా రోడ్ల నిర్మాణానికి, వంతెనల పునఃనిర్మాణానికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. నిధులు కేటాయించగానే ఆయా రహదారుల అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.