అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

2
0

అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారం

ఆత్మీయ పలకరింపుల మధ్య జరిగిన రాము పర్యటన

నిండు వర్షంలో సైతం…గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

మారుమూల ప్రాంతాలకు సైతం ద్విచక్ర వాహనంపై వెళుతూ…. ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాము

నందివాడ జులై 21: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

నందివాడ మండలంలోని అనమనపూడి.. పోనుకుమాడు.. గండేపూడి.. గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే రాము నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న గ్రామాల్లో ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ…. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ… ప్రజలకు కరపత్రాలు అందచేశారు.

వర్షం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న వెనకడుగు వేయకుండా మారుమూల ప్రాంతాలకు సైతం ద్విచక్ర వాహనంపై వెళుతూ ఎమ్మెల్యే రాము ప్రజలను పరామర్శిస్తూ ఆత్మీయంగా మాట్లాడుతున్నారు.

పర్యటనలో భాగంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే రాము….సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

పర్యటనలో భాగంగా గ్రామాల్లోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రాము పూ లమాలతో నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కులమత వర్గాలకతీతంగా పేద ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే పేద కుటుంబాలకు అధిక సంక్షేమం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ప్రజలకు సమస్యలు తెరెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు.

గ్రామాల్లో ఎమ్మెల్యే రాము పర్యటిస్తున్నంత సేపు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆయన వెంట నడుస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, సింగరాల రాధాకృష్ణ, ఏసు పాదం, సాల్మన్ రాజ్, సింగవరపు ప్రభాకర్, సత్యం,జగన్….అనమనపూడి గ్రామ నాయకులు తిరుమలరెడ్డి,రాధాకృష్ణ,,సుబ్రహ్మణ్యేశ్వర, మురళీకృష్ణ,బొట్టు కృష్ణ, కడియం శ్రీను, అడుసుమిల్లి కృష్ణారావు…పొనుకుమాడు గ్రామ టిడిపి నాయుకులు మరడానీ శ్రీనివాసరావు, తంగుడి సింహాచలం, పూడి ప్రసాద్, B. వెంకట శ్రీనివాస్, ఘంటసాల మారయ్య, దాసరి హరికృష్ణ, చంటిబాబు, శివాజీ, వికాస్,…గండేపూడి గ్రామ నాయకులు పెద్దిరెడ్డి శివరామ ప్రసాద్, పెద్దిరెడ్డి రాజ్యలక్ష్మి, భీమవరపు శ్రీనివాసరావు, పార్వతి, సప్ప కుటుంబరావు, P. గోపికృష్ణ,…మండల పరిధిలోని పలువురు టిడిపి నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here