ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న చంద్రబాబు ఇప్పుడెందుకు బిగిస్తున్నారు?

2
0

21-07-2025

ఆదానికి కట్టబెట్టి కార్మికుల పాట్ట కొడతారా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న చంద్రబాబు ఇప్పుడెందుకు బిగిస్తున్నారు?

విద్యుత్ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలి.

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్.

కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు
-విజయవాడలో 4000వేల మందితో భారీ ర్యాలీ…

విద్యుత్ కార్మికులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్, వర్కర్స్ యూనియన్, గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అండ్ మీటర్ రీడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‌సోమవారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు వేలాదిమంది కార్మికులు భారీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ కార్మికులను ఉద్ధేశించి ప్రసంగించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరిస్తానని ప్రకటించారు. అపరిమితమైన ఆరోగ్య పాలసీ, జీతాలు పెంపుదల, పదోన్నతి తదితర సమస్యలను పరిష్కరించాలని కోరతామని తెలిపారు. నేరుగా జీతాలు అందజేసే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని , ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు . కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయపరమైనవి మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే అగ్రభాగన మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఉన్నాయని. ఈ స్థాయిలో ఉండటానికి పై స్థాయి అధికారులు కృషి ఏమాత్రం కాదని. క్రింద స్ధాయి కార్మికులు చేస్తున్న కృషి ఫలితమేనని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.అతి తక్కువ వేతనాలు తీ‌సుకుని ప్రాణాలు సహితం లెక్కచేయకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో మన సంస్థలో పనిచేస్తున్న ఎందరో కార్మికులు తమ ప్రాణాలను అర్పించిన పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ సరఫరా మొత్తం కార్మికుల చేతుల్లోనే ఉందని, ఒక్కసారి షడ్ డౌన్ చేస్తే ఉన్నతాధికారుల ఏసీ లు పని చేయవని, మీ కష్టానికి గుర్తింపు వస్తోందన్నారు. రాష్ట్రమే అంధకారంలో ఉంటుందన్నారు.ఎనర్జీ అసిస్టెంట్స్, లైన్ మాన్ లకు, ఇతర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.యూనియన్ గుర్తింపు ఇచ్చి ఎన్నికల జరపాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here