రాబోయే ఎన్నికలలో బీసీల వాటా ఖచ్చితంగా తేల్చాలి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్
ఈ నెల 23,24 తేదీలలో చలో ఢిల్లీకి పిలుపు
విజయవాడ…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన ,జనగణన చేపట్టాలని ,జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈనెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేశామని, 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమాలలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు.. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా బీసీల వాటా తేల్చాలనే ముఖ్య లక్ష్యంతో కదం తొక్కుతున్నామని ఆయన పేర్కొన్నారు..
విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోను దుర్గా నరేష్ మాట్లాడరు…ఈనెల 23,24 తేదీలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.. బీసీ కులగణన, బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాబోయే ఎన్నికలలో బీసీల వాటా తేల్చాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. అక్కడ జరిగే సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ , కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.. గతంలో తాము చేసిన ఉద్యమాల వలనే బీసీ బిల్లు చట్ట రూపం దాల్చే విధముగా ముందుకు వెళ్తుందన్నారు.. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించారు.. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పారు.. బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.. సినిమాలలో హీరోగా చేయటం వేరు రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు..కేంద్రం ఇచ్చిన స్క్రిప్టులు ఇక్కడ చదవటం ఏమిటని ప్రశ్నించారు..ఒక భాషను బలవంతంగా రుద్దటం కరక్ట్ కాదన్నారు.. బీసీల భవిష్యత్ బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోను నరేష్ విజ్ఞప్తి చేశారు.. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ఆహ్లాదకర రాజకీయాలు ప్రారంభించాలని కోరారు.. అగ్రకులాలపై ఏనాడు దాడులు జరగలేదు అని బీసీల పైన మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు… బీసీ లు ఎదగటం ఇష్టం లేని వారే తమను అణగదిక్కుతున్నారని నరేష్ మండిపడ్డారు..
అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ మాట్లాడుతూ సమాజం ముందుకు వెళ్లేదే బీసీలకు అని గుర్తుంచుకోవాలన్నారు.. ఎన్నికల సమయంలో తమను వాడుకొని అనంతరం వదిలేస్తున్నారని గుర్తు చేశారు.. అగ్రకులాలు మాత్రమే ఉద్యోగాలు పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు.. 20% ఉన్న అగ్రకులాలు మాత్రం 80 శాతం పదవుల్లో ఉన్నారని,, 80 శాతం ఉన్న ప్రజల్లో 20% పదవుల్లో మాత్రమే ఉన్నారన్నారు. ఈ సమావేశం అనంతరం చలో ఢిల్లీ పోస్టర్ ను విడుదల చేశారు.. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్,, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వరప్రకాష్,, పిల్లా దినేష్,, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..