త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి
ఒకే మందిరంలో అన్ని పూజలు
అందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి క్షేత్రం లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆదేశించారు.
శనివారం ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాల తీరును ఆయన పరిశీలించారు. భక్తులకు అన్నప్రసాదాలు ఏ విధంగా అందుతున్నాయి, త్రాగు నీటి సౌకర్యం, వసతిని స్వయంగా గమనించారు.
ఒకే మందిరంలో అన్ని పూజలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
విజయవాడ దుర్గ గుడి, జూలై 19.
అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మరింత వేగవంతం
కనిపించాలి ఆలయ ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.
శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్ధం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో
మరింత వేగవంతం తో పనులు చేపట్టి గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి అయ్యేలా పని చేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. కొండ మీద అన్ని పూజలు ఒకే ప్రాంగణంలో జరిగేలా నిర్మిస్తున్న పూజా మంటపం భవనం, యాగాలు నిర్వహించే సువిశాల యాగశాలలను శనివారం ఉదయం పరిశీలించి, ఇంజినీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శ్రావణ మాసం ఆరంభంలోపే ఈ రెండు నిర్మాణాలు పూర్తి అయితే భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.పూజా మంటపం పైన అంతస్తు పరిశీలన చేశారు.
అనంతరం భక్తుల సౌకర్యార్థం మహా మంటపం క్యూలైన్లలో మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు పర్యవేక్షణ చేసి, పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది కి శీనా నాయక్ పలు సూచనలు చేశారు. మహా మంటపం ప్రతీ ఫ్లోర్ సిబ్బంది పర్యవేక్షించాలని, పరిశుభ్రత విషయంలో ఇంకా మెరుగు పడాలని సూచించారు. దర్శనం అయిన భక్తులకు అన్న ప్రసాదం అందుబాటులో ఉందని తెలిసేలా మైక్ ప్రచారం చేయాలని దీనికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. అన్న ప్రసాదం హాల్ పరిశీలించి, భక్తులతో ఈవో మాట్లాడారు. కొండపైకి చేరే మార్గాలు, కొండ దిగువుకు చేర్చే మార్గాలు అత్యంత శుభ్రంగా ఉండే రీతిలో చర్యలు తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ నిబంధనలు అనుసరించి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పవిత్రత గా, పరిశుభ్రత తో ఉంచేలా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.