రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఏ.ఏం.సి పాలకవర్గంతో సమావేశంలో ఎంపీ చిన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 19.07.2025.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏ.ఏం.సి) చైర్మన్ గా నర్రా వాసు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
దీన్ని పురస్కరించుకుని ఏ.ఎం.సి పాలకవర్గంతో శనివారం జరిగిన సమావేశంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్రా వాసు ని అభినందించి, ఘనంగా సత్కరించారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేశారు.
శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి, వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి రైతులకు విశేషంగా సేవలందించాలన్నారు.
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వాసు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణమే స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులకు అన్ని సేవలు సకాలంలో లభించే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.