క్యూ లైన్లు తనిఖీ
భక్తుల మౌలిక వసతులకే
పెద్ద పీట
శుక్రవారం ఉదయం దుర్గమ్మ వారి ఆలయంలో పర్యటించిన ఈవో శీనా నాయక్
విజయవాడ దుర్గ గుడి, జులై 18.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని ఆలయ సిబ్బందికి కార్యనిర్వహణాధికారి వి. కె.
శీనా నాయక్ ఆదేశించారు.
శుక్రవారం ఉదయం
ఆలయ కార్య నిర్వాహణాధికారి వీ.కే సీనా నాయక్, అర్చక స్వాములతో కలిసి ఆలయ పరిసరాలు భక్తులకు కల్పించు మౌలిక సదుపాయాలు, భక్తులకి సంతృప్తికరంగా ఉండే విధంగా దర్శనం, త్రాగునీరు, వాష్ రూమ్లు, భక్తులు వెయిటింగ్ ఏరియా ,రవాణా సౌకర్యం ,ప్రసాదాలు తాజాగా రుచిగా ఉండుటకు, పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉంచుటకు ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.