రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలి

2
0

ఎన్‌టిఆర్‌ జిల్లా
తేది: 17.07.2025

రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలి

మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన ధరలు అమలయ్యేలా చర్యలు…..

దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే సహించం….
ఎస్టేట్ అధికారులకు దశ, దిశ నిర్దేశించిన జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియా.

రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియా అధికారులను ఆదేశించారు.

నగరంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో గురువారం మార్కెటింగ్, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్‌.ఇలక్కియా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు పండించిన పంటను నేరుగా వినియోగదారులకు రైతు బజార్ల ద్వారా అమ్మకాలు నిర్వహించి రైతులు, వినియోగదారులకు మేలు జరిగేలా రైతు బజార్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అర్బన్ లో తొమ్మిది, రూరల్ లో ఆరు మొత్తంగా 15 రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని రైతు బజార్లలో కచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యాపారాలు నిర్వహించే రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.
రైతు బజార్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. ఉదయం ఆరు గంటలకే అన్ని రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులు విధులలో ఉండి ధరల పట్టికను సిద్ధంగా ఉంచాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ధరలకే రైతు బజార్లలో అమ్మకాలు నిర్వహించేలా ఎస్టేట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
పరిసరాలను, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ ను మెరుగుపరచాలన్నారు. రైతు బజార్ల ప్రక్షాళనకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విధులలో అలసత్వం వహించిన, ఫిర్యాదులు వచ్చిన సహించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియా ఎస్టేట్ అధికారులను హెచ్చరించారు.

సమావేశంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి. రాజబాబు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here