17-7-2025
వినికిడి సమస్యతో బాధపడుతున్న వారు వినికిడి యంత్రాలను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని MLA బొండా ఉమ కి కృతజ్ఞతలను వ్యక్తం చేశారు
ధి:17-7-2025 గురువారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ నెల 3-7-2025 62వ డివిజన్ LBS నగర్ నందు ఉప్పలపాటి స్వప్న సుందరి. స్వప్న సుందరి కి. 3-7-2025 25వ డివిజన్ కార్మిక పురం నందు జట్కా. సుబ్బమ్మ కి, 8-7-2025 30వ డివిజన్ మధ్యకట్ట అమ్మవారి గుడి వద్ద S. ఈశ్వరమ్మ కి “సుపరిపాలనకు తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమమహేశ్వరరావు ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న MLA బొండా ఉమామహేశ్వరరావు ఆ సమయంలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి వినికిడి యంత్రాలను తన సొంత నిధులతో తెప్పించి అందజేయడం జరిగింది.
సందర్భంగా వినికిడి సమస్య ఉన్నవారు మాట్లాడుతూ
వినికిడి సమస్య ఉన్న వారు ఎంతో కాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నామని, ఈ సమస్య వలన రోజువారీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బయటకు వెళ్ళినప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, టీవీ చూసేటప్పుడు కూడా వినపడకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని, వినికిడి యంత్రాలు కొనుక్కోవాలంటే తమకు ఆర్థిక స్తోమత లేదని, ఎమ్మెల్యే తమ సమస్యను తెలుసుకుని, స్వంత ఖర్చుతో వినికిడి యంత్రాలు అందజేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు
2024 ఎన్నికల్లో NDA కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందనే నమ్మకంతో సెంట్రల్ నియోజకవర్గంలో MLA బొండా ఉమా ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామని, ఎన్నో సంవత్సరాలుగా తమకు ఆర్థిక స్తోమత లేక వినికిడి యంత్రాలను వాడలేకపోయామని, MLA పాదయాత్రలో తమ ఇంటి వద్దకే వచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారని, ప్రజలకు కావలసినటువంటి రోడ్లు, కాలువలోని మురికి శుభ్రం చేపించి మంచి పనులు దగ్గరుండి చేపిస్తున్నారని, పెన్షన్లు లేనివారికి తక్షణమే పెన్షన్లు మంజూరు చేపించిన గొప్ప నాయకులు ఎమ్మెల్యే అని, వెంటనే స్పందించి తమ ఇబ్బందిని గుర్తించి బాధితులకు సహాయం అందించిన MLA బొండా ఉమ కి, కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. MLA ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రశంసించారు
ముఖ్యంగా పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి బాధలను తీరుస్తున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. MLA లె సేవలను కొనియాడుతూ, ఆయన నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు, ఇలాంటి నాయకుడు తమకు దొరకడం తమ అదృష్టమని ప్రజలు భావిస్తున్నారు
MLA బొండా ఉమ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల సేవలో తరిస్తానని తెలిపారు, ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు
ఈ కార్యక్రమం లో మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృషమోహన్, 30 డివిజన్ అధ్యక్షుడు లక్కం రాజు శ్రీనివాస్ రాజు, కర్ణం వెంకటరమణ, వీరభద్రం, 62వ డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, ఇన్చార్జి పైడి శ్రీను, 63 62 క్లస్టర్ ఇంచార్జ్ బత్తుల కొండ, 25వ డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపి, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు