ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు

7
0

17-07-2025

ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు
ఎమ్.ఎ.సి.పి.ఎస్ ఇంప్లీమెంట్ చేయించాల‌ని విన‌తి ప‌త్రం అంద‌జేత

విజ‌య‌వాడ‌: 7వ వేత‌న సంఘం సిఫారసులు అమలులోకి వ‌చ్చిన జూలై 1, 2016 నుంచి మోడిఫైడ్ అష్యూర్డ్ కేరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ (ఎమ్.ఎ.సి.పి.ఎస్) ను ఇంప్లీమెంట్ చేయించాల‌ని ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు ఎంపీ కేశినేని శివనాథ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ఆలిండియా స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (సౌత్ సెంట్ర‌ల్) బైద్యనాధ్ షా ఆధ్వ‌ర్యంలో ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో గురువారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు.

మోడిఫైడ్ అష్యూర్డ్ కేరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ ను 2016 నుంచి కాకుండా 16-02-2018 నుంచి ఇంప్లీమెంట్ చేస్తున్నారు. ఇందువ‌ల్ల స్టేష‌న్ మాస్ట‌ర్స్ కు చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌ని, 2016 నుంచి ఇంప్లీమెంట్ చేస్తే స్టేష‌న్ మాస్ట‌ర్స్ తో పాటు రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ కు చాలా ప్ర‌యోజ‌నంగా వుంటుంద‌ని తెలియ‌జేశారు. వారి స‌మ‌స్య‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు టి.వి.కె.ఎమ్. చ‌ల‌ప‌తి రావు, ఎమ్.సాంబిరెడ్డి, కె.వి.ఎస్.ఎస్. శాస్త్రి, ఎమ్.శేష‌సాయిల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here