బీసీల సంక్షేమానికి రూ.47 వేల కోట్లు యార్లగడ్డ

2
0

బీసీల సంక్షేమానికి రూ.47 వేల కోట్లు : యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్ :
కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి 47,456 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ ఇంటింటి ప్రచారం నిర్వహించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో రూపొందించిన కరపత్రాలను, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు తగిన గౌరవం ఇచ్చి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయించడంతోపాటు, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది బీసీ నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగారని గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యార్లగడ్డ భరోసా ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. రూ. 17 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును, రూ. 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, రూ. 20.80 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండేటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బేతాళ మాణిక్యాలరావు, మూల్పూరి సాయి కళ్యాణి, వేగిరెడ్డి పాపారావు, గుండపనేని ఉమా వరప్రసాద్, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ లు పొనుగుమాటి చంటి బాబు, పామర్తి ప్రభాకరావు, రాజులపాటి నాగరాజు, బేతాళ రాంబాబు, ఆరేపల్లి వెంకటేశ్వరావు, కొల్లాబత్తిన నరేంద్ర, బల్లవరపు దావీదు, జొన్నలగడ్డ బాలకృష్ణ, వీరంకి రామారావు, కొండేటి సత్యనారాయణ, గండేపూడి నితీష్, మొవ్వ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here