ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కనీస వేతనం 26,000 వేలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి
విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జూలై 15,
ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్య పై ఏఐటీయూసీ పిలుపు మేరకు ఈనెల మూడో తారీకు నుంచి పలుదాపాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ 15వ తారీకు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయవాడ ధర్నా చౌక్ ప్రాంగణంలో నిరసన తెలిపి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తమ్మిశెట్టి నరసింహారావు,సుబ్బారావు, మధుసూదన్ రావు,దుర్గారావు, జోజి,రాంబాబు,రామారావు, పోతురాజు,రాజేష్,తదితరులు కార్మికులు పాల్గొన్నారు.