మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలలో -MLA బొండా ఉమ

2
0

14-7-2025

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలలో -MLA బొండా ఉమ

పాఠశాలలో గత ఏడాది పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులను గోకరాజు గంగరాజు ప్రోత్సాహక బహుమతులను MLA బొండా ఉమ చేతుల మీదుగా అందజేసి సత్కరించారు

ధి:-14-7-2025 సోమవారం ఉదయం సింగ్ నగర్ వివేకానంద సెంటినరీ ఉన్నత పాఠశాల నందు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల కోలాహలం నడుమ కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించి పాఠశాలలో  కార్మికులకు నూతన వస్త్రాలు, వేద పండితులకు కూరగాయలు, దివ్యాంగులకు కూరగాయలు అల్పాహారం, విద్యార్థులకు పుస్తకాలను గోకరాజు గంగరాజు MLA బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బోండా ఉమా మాట్లాడుతూ విద్యతోనే ప్రతి ఒక్కరి వికాసం సాధ్యపడుతుందని, మాజీ ఎంపీ, రామకృష్ణ సమితి గౌరవాధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు గోకరాజు గంగరాజు వివేకానంద విద్యాసంస్థల ద్వారా వేలాదిమంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందటం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని

సేవ తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి గోకరాజు గంగరాజు అని, రాజకీయ వేత్తగానే కాకుండా వ్యాపార పరంగాను, సేవా పరంగాను ఈ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్న నాయకుడు గోకరాజు గంగరాజు అని, గోకరాజు గంగరాజు నిండు నూరేళ్లు జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు తెలియజేసారు

ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ పిన్నమ్మరాజు త్రిమూర్తి రాజు, వలివేటి దుర్గాప్రసాద్, అప్పలరాజు, SLV శ్రీనివాస్ రాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here