భక్తులు సులభతరంగా ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి అన్ని మార్గాలు సుగమం చేసే పనిలో అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ అన్నారు.
శనివారం ఉదయం దేవస్థాన కార్యాలయంలో నగర పోలీస్ శాఖ అధికారులు, దేవస్థానం సిబ్బంది, వైదిక సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి కొన్ని గంటల్లోనే విజయవాడ చేరుకుని కుమ్మరి పాలెం సెంటర్ నుండి దేవస్థానం పైకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని భక్తులు పేర్కొన్న విషయాలుపై ప్రత్యామ్నాయ దారులు గురించి, టోల్ గేట్ మార్పు చేయుట గురించి చర్చించారు.
మునిసిపల్ ఆఫీస్ వద్ద హోల్డింగ్ ఏరియా అభివృద్ధి, కనకదుర్గ నగర్, దుర్గాఘాట్ లో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏర్పాటు, భక్తుల సౌకర్యార్ధం పాలనా వికేంధ్రీకరణ క్రింద కొండ దిగువునే పలు సౌకర్యాల ఏర్పాటు గురించి పోలీస్ అధికారులకు ఈవో వివరించారు.
కొండ దిగువున దేవస్థాన ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం, ఆలయ సంస్క్రతి ప్రతిభింభిచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పోలీస్ అధికారులు శ్రీ జి. రామకృష్ణ, శ్రీ దుర్గారావు, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ కోటేశ్వరరావు, రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు