ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.
తేదీ.12-07-2025.
సెంట్రల్ డివిజన్ సురక్షా కమిటీ సమావేశం
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డి.సి.పి. కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోదర రావు ఆద్వర్యంలో ఈ రోజు పటమట పోలీసు స్టేషన్ పరిదిలోని ఆటోనగర్ క్రాంతి రెసిడెన్సీ నందు సెంట్రల్ డివిజన్ పరిదిలోని సురక్షా కమిటీ మెంబర్స్ తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి.తోపాటు సురక్షా కమిటీ కన్వీనర్ నరసయ్య పటమట ఇన్స్పెక్టర్ శ్రీ పవన్ కిశోర్ మాచవరం ఇన్స్పెక్టర్ ప్రకాష్ గుణదల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సురక్షా కమిటీ మెంబర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎ.సి.పి. కె.దామోదర రావు మాట్లాడుతూ. ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనర్ రేట్ పరిదిలో ఎటువంటి నేరం జరిగిన గంటల వ్యవదిలోనే నింధితులను గుర్తించే విధంగా మరియు నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా నగరాన్ని మరింత భద్రంగా ఉంచాలనే సదుద్దేశంతో పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ రేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ, 64 వార్డులు మొత్తం 1211 చ.కిలోమీటర్లు నగరాల నుండి గ్రామాల వరకు 100 శాతం సి.సి.కెమెరాల ద్వారా కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో సురము 7000 సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయడం అంటే అధి కేవలం మన సి.పి. రాజ శేఖర బాబు చొరవతోనే సాధ్యమయ్యింధని అంతేకాకుండా నగరంలో దేవాలయాలు మసీదులు చర్చిలలో కూడా సి.సి.కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా మన సురక్షా కమిటీ వారు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని, ప్రజల పట్ల పూర్తి బాధ్యత తో పోలీసు శాఖ పని చేస్తుందని, ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బంది ఉన్నా స్పందించి ముందుకు రావాలని అంతే కాకుండా మనం అంధరం సి.పి. ఆద్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలను అంధించే విధంగా ముందుకుపోవాలని తెలియజేశారు.