12-07-2025
మంగళగిరి,
టీడీపీ కేంద్ర కార్యాలయం
ఎమ్మెల్యే బొడే ప్రసాద్, ఏపీఆర్టీ ఆర్టీసీ చైర్మన్ కోనకళ్శ నారాయణ మీడియా సమావేశ వివరాలు :
‘‘చీకట్లో నరికేయండి’’ అని పేర్నినాని అనడం దేనికి సంకేతం?
ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ కొనకళ్ళ నారాయణ ఫైర్
‘‘చీకట్లో నరికేయండి” అని పేర్నినాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ కొనకళ్ళ నారాయణ తీవ్ర స్థాయి మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొడే ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారు. మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చేసే ప్రతి పనిని కూడా ప్రజలు గమనిస్తారు. తప్పు జరిగితే క్షమించాను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తారు. రెంటపాళ్ల పర్యటనలో వారి పార్టీ కార్యకర్త రప్పా.. రప్పా.. అని ప్లకార్డు పట్టుకుంటే.. మీడియా సమక్షంలో దానిని సమర్ధించారంటే జగన్ రెడ్డి మానసిన పరిస్థితి ఎలా ఉందో ఆర్థం అవుతుంది. ఒక్క పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా..? జగన్ రెడ్డి. ‘చీకట్లో కన్ను కోడితే.. తలలు నరికేయండి’ అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అభివృద్ధి – సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదేపదే చెప్తు ఉంటారు. వైసీపీ వారు మాత్రం.. పది మందికి స్ఫూర్తిని ఇవ్వాల్సిన వీరు.. హత్యలు చేయండి.. తలలు నరకండి.. అని చెప్తున్నారంటే వారి పార్టీ ఆలోచనలు కానీ, నాయకుల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. హింస.. విధ్వంసం.. వైసీపీ యొక్క పాలసీ.. పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైంది. రప్పా.. రప్పా.. నరికేస్తాం… అనేది వైసీపీ తీసుకువచ్చిన రాజారెడ్డి రాజ్యాంగం.. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుంది. రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్, భూ దండా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని వీర్రవిగి వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకువాలి. గత ప్రభుత్వ పాలనలో బీచ్ రోడ్డులో పూరి గుడిసెలకు నిప్పు పెట్టడం.. ప్రజా రక్షణ కోసం పని పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది.. ఇది నిజమా..? కాదా..? రప్పా.. రప్పా అని టీవిల ముందు కాదు.. మచిలీపట్నంలో నువ్వు అక్రమించిన వెయ్యి గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ, నువ్వు కబ్జా చేసిన కోటా జయరాం పొలం వద్ద కానీ, రంగనాయక స్వామి గుడి దగ్గరకు కానీ వెళ్తే నీ రప్పా.. రప్పా.. సంగతి అక్కడి స్థానికులు నీకు బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. గత ప్రభుత్వం ఏ విధంగా మోసం చేశారో.. ప్రజలందరూ గమనించి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ ఓర్వలేక హింసను ప్రోత్సహిస్తున్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందజేస్తున్నందుకు కూటమి నేతలను నరకలా..? ప్రజలందరూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి మీడియా ఎవరిదనేది ప్రజలందరికీ తెలుసు.. అదే ఛానల్ రాజధాని అమరావతి మహిళల మీద మురికి వ్యాఖ్యలు చేస్తే.. జగన్ రెడ్డి కనీసం స్పందించిన పాపాన పోలేదు. పొదిలిలో అమరావతి మహిళల మీద దాడి చేయించారు. అంతే కాకుండా నెల్లూరు జిల్లా కొవూరుకు సోదరి వరుస అయ్యే మహిళ ఎమ్మెల్యేను ఇష్టారాజ్యం మాట్లాడేందుకు కూడా వీలు లేని పదాలతో అక్కడి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అవమానించారు. సొంత చెల్లిని ఇంటి నుంచి గెట్టేసి.. ఆమె కట్టుకున్న చీర మీద కామెంట్లు చేసే పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నదంటే.. వారి పార్టీలో పని చేసే ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, అదే మానసిక పరిస్థితిలో ఉంటారు.. దానికి కొవూరు ఎమ్మెల్యే, అమరావతి మహిళల మీద దాడే ఇందుకు నిదర్శనం. అఖరికి సమాజాన్ని సరైన దారిలో నడిపే మీడియాపై కూడా దాడి చేయటం దారుణం’’ అని అన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ ‘‘గత ఎన్నికల ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి.. ప్రతిపక్ష హోదా దక్కకుండా.. ఘోరంగా ఓడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం అత్యంత అధిక మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ర్పచారం చేస్తూన్నారు. రప్పా.. రప్పా.. చీకట్లో కన్ను కోడితే పని అయిపోవాలి.. తలలు లేచిపోవాలి.. అని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం..? మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని ప్రజాస్వామ్యన్ని రక్షించేవిధంగా మాట్లాడాలి. కానీ, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం దారుణం. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది.. సీఎం చంద్రబాబు సారధ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో హింసను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించరు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తు.. అవినీతి మయంగా, ఆరాచకంగా మార్చారు. గతంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలపై దాడులు చేసి, హత్యలు చేశారు. అది మీ సంస్కృతి.. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. పేర్ని నాని మీద బందరులో ఎన్ని అభియోగాలు ఉన్నాయి.. ఎన్ని నేరాలు చేశావ్.. గోడౌన్ లో రేషన్ బియ్యం ఎక్కడికి పోయాయి. రంగనాయకుల గుడి 10 ఎకరాల స్థలానికి ఏమి సమాధానం చెప్తావ్.. బీచ్ పక్కన ఉన్న గుడిసెలను తగలబెట్టారు.. దానికి ఏమి సమాధానం చెప్తావ్.. దమ్ము ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడాలి.. పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ్మిన వారి సత్రానికి చెందిన 1000 గజాల స్థలాన్ని అక్రమించుకున్నారు. పేర్ని నాని తండ్రి పేర్ని విష్ణుమూర్తి ఎనాడూ కూడా హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడలేదు. కానీ, నీ ప్రవర్తన ధోరణీ మీ నాయకుడు మెచ్చుకునే విధంగా ఉంది. హింసను ప్రోత్సాహించి.. పరుష పదజాలంతో వేరే పార్టీ వారిని తిడితే మీ నాయకుడికి ఆనందం.. జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . ఎక్కడ ఏ విధమైన అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం యువనాయకులు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తే అడుగు అడుగున ఆటంకాలు సృష్టించారు. మేము అధికారంలోకి వస్తే గతంలో కంటే మంచి పాలన సాగిమని చెప్పలే కానీ, బెదిరింపులు మాటలతో ప్రజలను భయబ్రాంతులను గురి చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు’’ అని అన్నారు.