విజయవాడ, తేదీ: 10.07.2025
భారత ప్రమాణాల బ్యూరో (BIS) దేశంలో తయారైన వస్తువులు మరియు ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తున్న వస్తువులు భారతీయ ప్రమాణాలను కలిగి ఉన్నాయో లేదో BIS పరిశీలిస్తుందని పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ ఏ. రామలింగేశ్వరరాజు అన్నారు.. గురువారం మినర్వా హోటల్ లో భారత ప్రమాణాల బ్యూరో (BIS) ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ఇండియా ల సహకారంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ. రామలింగేశ్వరరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఏ. రామలింగేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 16 లక్షల ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు, 1100 బారీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. BIS మార్క్ తీసుకోని వాటిలో ఎక్కువగా చిన్న పరిశ్రమలు ఉంటాయన్నారు. BIS మార్క్ తీసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో అంత ఆసక్తి చూపించటం లేదన్నారు. ఇతర దేశాలకు ఈ వస్తువులను పంపిచాల్సి వచ్చినప్పుడు BIS సర్టిఫికేషన్ అవసం తప్పనిసరి అవుతుందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో సర్టిఫికేషన్ పొందటం చాలా సులువుగా ఉందన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈ లు BIS సర్టిఫికేషన్ పొందటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయని రామలింగేశ్వర రాజు అన్నారు.
BIS డైరెక్టర్ ప్రేమ్ సజినీ పట్నాల మాట్లాడుతూ ఇండియాలో స్టాండర్డ్స్ చేయాలంటే అది BIS మాత్రమే చేయాలన్నారు. ఇండియాలో ప్రాడక్ట్ తయారీ, నిల్వ, అమ్మకాలు చేయాలన్నా BIS సర్టిఫెకేషన్ చేయాలన్నారు. ఇండియాలో 816 వస్తువులకు BIS సర్టిఫికేషన్ పొందేలా తప్పనిసరి చేశారన్నారు. ఇతర దేశాలకు చెందిన వస్తువులు ఇండియాలో అమ్మాలన్నా BIS సర్టిఫికేషన్ అవసరం ఉందన్నారు. సంవత్సరానికి రెండుసార్లు తనిఖీలు నిర్వహిస్తామని, ఫిర్యాదులు వస్తే దాడులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఆన్‌లైన్‌లో నాణ్యత నియంత్రణలో ఆ వస్తువు వివరాలు రెండుసార్లు కంటే ఎక్కువ కనిపించకపోతే, ఎవరైనా BIS మార్క్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేకరణ విధానంలో భారతీయ ప్రమాణాల అవసరాన్ని జోడించాలని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రామాణీకరణ కోసం జరిగిన మొదటి రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు ఆమె చెప్పారు.
FSME చైర్మన్ KLN ప్రకాష్ రావు మాట్లాడుతూ, బిస్మార్క్ ఉనికి ఉత్పత్తికి హామీ ఉందని రుజువు అని అన్నారు. నేడు అందరికీ నాణ్యతపై ఆసక్తి పెరిగింది. బిస్మార్క్ అమలు చేస్తే ఉత్పత్తి నాణ్యత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈ లు గ్లోబల్ గా ఎదగాలంటే BIS మార్క్ ఉంటే పెరిగే అవకాశం ఉందన్నారు. BIS మార్క్ సర్టిఫికేషన్ లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వివేక్ రెడ్డి BIS కార్యకలాపాలు, భారతీయ ప్రమాణాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, BIS లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, QCO ఆర్డర్లు, BIS కేర్ యాప్, స్టాండర్డ్స్ వాచ్, MSMEల కోసం BIS ద్వారా హ్యాండ్‌హోల్డింగ్ చొరవలు మొదలైన వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
కార్యక్రమంలో 100 మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వారి ప్రశ్నలకు BIS డైరెక్టర్ సమాధానాలు అందించారు.