శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
కూటమి నేతలతో కలిసి
పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
గురు పౌర్ణమి సందర్భంగా చెరువు సెంటర్ ,శ్రీ షిరిడి సాయిబాబా మందిరం
(చిన్న సాయిబాబా గుడి)
చెరువు సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి
స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.
భజనలు, కీర్తనలతో పలువురు భక్తులను ఆకట్టుకున్నారు .. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్ బావి శెట్టి శ్రీనివాస్ , జనసేన లీగల్ సెల్ గంజి పవన్, జనసేన 38 వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన సిటీ జాయింట్ సెక్రెటరీ గన్ను శంకర్, బీజేపీ నాయకులు గన్నవరపు శ్రీనివాస్, దుర్భేశుల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు