తేది:10-07-2025
గతంలో మనిషిని తొక్కించారు-
నేడు మామిడికాయలు తొక్కించారు-
ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే చర్చకు రండి- మంత్రి నాదెండ్ల
659.39 కోట్ల రూపాయలు
30,403 రైతుల ఖాతాలో జమ
2024-2025 మొత్తము 4575.32 కోట్ల రూపాయలను 2,01,934 రైతుల ఖాతాలో జమ
100 శాతం సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేసిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఖరీఫ్ మరియు రబీ 2024-25 సీజన్లో 2,01,934 రైతుల వద్ద నుండి 4575.32 కోట్ల విలువగల 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేయటమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధముగా ధాన్యము కొనుగోలు చేసిన 24గం నుంచి 48గంల లోపే నగదు రైతుల యొక్క ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగినది. ధాన్యం కొనుగోలు బకాయిల నిమిత్తం ది.10-07-2025 న రూ.659.39 కోట్ల రూపాయలను 30,403 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
దేశంలో మొదటిసారి
2024-2025 మొత్తము ఇప్పటివరకు 4575.32 కోట్ల రూపాయలను 2,01,934 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. 100 శాతం సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగినది.
గడిచిన రబీ కాలంలో
2021-22- సంవత్సరములు 2,29,248 రైతుల నుంచి 26,23,535 కోట్ల రూపాయల విలువ గల 5,099.62 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది.
రబీ 2022-23 సంవత్సరములు 1,58,784 రైతుల నుంచి 2,884.04 కోట్ల రూపాయల విలువ గల 14,12,881 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది.
రబీ 2023-24 సంవత్సరములు 1,32,859 రైతుల నుంచి 2,763.86 కోట్ల రూపాయలు విలువగల 12,64,845 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో 2024-25:
5,65,662 మంది రైతుల నుండి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు, దీని విలువ రూ.8282.27 కోట్లు.
24 – 48 గంటల్లోపు 5,65,662 మంది రైతులకు మొత్తం రూ.8282.27 కోట్లు రూపాయలు చెల్లించడం జరిగింది.
మొత్తం 24.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యమును (FCI:3.72 లక్షల మెట్రిక్ టన్నుల CSC: 20.59 లక్షల మెట్రిక్ టన్నులు) స్వీకరించడం జరిగినది.
గడిచిన ఖరిఫ్ పంట కాల వివరములు:
ఖరిఫ్ 2021-22 కాలంలో 5,79,403 రైతుల నుంచి 7,846.13 కోట్ల రూపాయల విలువ గల 40,31,652 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
ఖరిఫ్ 2022-23 కాలంలో 6,39,510 రైతుల నుంచి 7,222.10 కోట్ల రూపాయల 35,36,136 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
ఖరిఫ్ 2023-24 కాలంలో 4,97,907 రైతుల నుంచి 6,549.15 కోట రూపాయిలు విలువ గల 29,97,063 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
-2024-25 కాలంలో
5,752 మంది రైతుల నుండి రూ.119.33 కోట్ల విలువైన 35,401 మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 3,379 మంది రైతులకు రూ.65.83 కోట్లు చెల్లింపులు జరిగినాయి.
రాగులు:
525 మంది రైతుల నుండి రూ.3.87 కోట్ల విలువైన 902 మెట్రిక్ టన్నుల రాగులు సేకరించాము. ఇప్పటివరకు 502 మంది రైతులకు రూ.3.26 కోట్లు చెల్లింపులు జరిగినాయి.
గత ప్రభుత్వము చెల్లించకుండా ఉన్న ధాన్యం బకాయిల మొత్తము రూ.1674.47 కోట్లు 84,724 మంది రైతులకు ఈ ప్రభుత్వము అధికారము లోనికి రాగానే పూర్తిగా జమ చేయటం జరిగిందని వివరించారు.
ఒక పార్టీ అధినేత చిల్లర మనస్తత్వంతో
గతంలో మనిషిని తొక్కించారు,
నేడు చిత్తూరు జిల్లాలో మామిడికాయలు తొక్కించారు.. ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే చర్చకు రండి అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు, వారికి కష్టం రాకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ధాన్యం కల్లాలను సందర్శించినప్పుడు మనం చెప్పులు లేకుండా…. కల్లా లోకి వెళ్లి ధాన్యం రాశులను పరిశీలిస్తాం అది రైతులకు మనం ఇచ్చే గౌరవం…
నేడు ఒక పార్టీ అధినేత చిత్తూరు జిల్లా పర్యటనలో ఐదు ట్రాక్టర్లతో రెడీ చేసుకున్న పంటను దొంగ చాటుగా తీసుకువచ్చి రోడ్డుపై మామిడి కాయలు పోసి కేవలం ఫోటోలు కోసం వీడియోలు కోసం రైతు పండించిన పంటను ట్రాక్టర్లతో తొక్కేయడం దుర్మార్గం అన్నారు. రాజకీయాల్లో
ప్రశ్నించే మనస్తత్వం ఉంటే, రైతు పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే
చర్చకు రండి అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అద్భుతంగా, పారదర్శకంగా చేసిన ధాన్యం కొనుగోలు…
గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారు చర్చిద్దాం అన్నారు..
వ్యక్తిగత విమర్శలు, పోలీస్ పై దాడులు… వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం… ఎస్పీ స్థాయి, డిఎస్పి స్థాయి అధికారులను బెదిరించడం… కాలు నరుకుతాం, చేతులు నరుకుతాం అంటూ.. ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా అని ప్రశ్నించారు.
రైతులను కలవాలి … వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.. శాసనసభలో చర్చించాలి… ఇది ఒక రాజకీయ పార్టీ అధినేతగా మీరు చేయవలసిన పని అంటూ సలహా ఇచ్చారు.. రాష్ట్రంలో శాంతిభద్రతల విగాతం కలిగించేలా ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు..
ప్రజలను, రైతులను, మహిళలను రక్షించే విధంగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుందని తెలిపారు.