విజయవాడ లో దుర్వాసన రాని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం

0
0

విజయవాడ నగరపాలక సంస్థ
10-07-2025

విజయవాడ లో దుర్వాసన రాని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం

సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామలింగేశ్వర నగర్ పర్యటించి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దుర్వాసన రాకుండా ఏర్పాటు చేయనున్న ఓడర్ కంట్రోల్ యూనిట్ లను పరిశీలించారు. ప్రస్తుతం సిహెచ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దుర్వాసన ఎంత శాతం వస్తుంది ఓడర్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత దుర్వాసన ఎంత శాతం తగ్గుతుంది వాటి విషయాలపై అధికారులు నివేదికని ఇవ్వాలని వాటిని ఏర్పాటు చేసిన తర్వాత తామే స్వయంగా వచ్చి పరీక్షిస్తానని తెలిపారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఓడర్ కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేసి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓడర్ కంట్రోల్ యూనిట్ను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవి పాడైపోయినప్పుడు అలారం , సెన్సార్ ద్వారా పనిచేయుటకు స్కాడా సిస్టం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలేజ్ విద్యార్థులకు తమ చదువుల్లో భాగంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లను చూపించే క్రమంలో కేవలం హెడ్ వాటర్ వర్క్స్ అనే కాకుండా సిబిహెచ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను చూపిస్తూ వాటిలో జరిగే ఇంజనీరింగ్ విషయాలను పిల్లలకు తెలియజేసేటట్టు ప్రతి యూనిట్ దగ్గర అది చేసే పని వివరించే సైనేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిడో ప్రాజెక్ట్ ద్వారా ఎస్ టి పి లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి తమకు నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ కే షమ్మీ, పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here