సచివాలయంలో మం త్రి నారాయణను కలిసిన అమరావతి అక్రిడేటెడ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు.
2014-19 మధ్య కాలంలో జర్నలిస్ట్ లకు అమరావతిలో ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్ట్ ను తిరిగి అమలు చేయాలని వినతి.
అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కోసం గత టీడీపీ ప్రభుత్వంలో 30 ఎకరాలు కేటాయించిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన జర్నలిస్ట్ లు.
ప్రభుత్వం మారడంతో గతంలో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వివరించిన జర్నలిస్ట్ లు.
తిరిగి ప్రాజెక్ట్ ను కొనసాగించి ప్రభుత్వమే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వినతి. ఈ మేరకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కొంత రాయితీతో హ్యాపీ నెస్చ్ మోడల్ లో నిర్మిస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను మంత్రి కి అందచేసిన ప్రతినిధులు. ఇందుకు నాలుగు కేటగిరీలు గా నిర్మాణం జరిపేందుకు ముఖ్యమంత్రి కూడ అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే ఒక మోడల్ జర్నలిస్ట్ కాలనీ నిర్మించాలని అధికారులను ఆదేశిస్తూ ఇచ్చిన ొఉత్తర్వులను మంత్రికి గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబు నాయడు తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపిన మంత్రి నారాయణ.
మంత్రిని కలిసి వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగి సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, ఫౌండర్ సెక్రటరీ చావా రవి, డైరెక్టర్లు ఈశ్వర్ , శ్రీనివాస్, నరసింహారావు, సీనియర్ జర్నలిస్టుల కృష్ణ మోహన్, మల్లికార్జున్ , పవన్, ముక్కంటి తదితరులు ఉన్నారు