సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పాలన :ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

0
0

09-07-2025

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పాలన :ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లం గొల్ల‌పూడి ద‌ర్గా హరిజ‌న‌వాడ‌లో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మం

ఇంటింటికి వెళ్లి ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాలు పంపిణీ

విజ‌య‌వాడ రూర‌ల్ : రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. కూటమి ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందటంతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సంతోషంతో వున్నార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ రూరల్ మండ‌లంలో గొల్ల‌పూడి ద‌ర్గా హ‌రిజ‌న వాడ‌లో సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) , మైలవరం నియోజకవర్గ అబ్జర్వర్, తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దారునాయక్,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు జంపాల సీతారామయ్య, బొమ్మసాని సుబ్బారావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసుల‌తో క‌లిసి బుధ‌వారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి కూట‌మి ప్ర‌భుత్వం ఏడాదిగా చేప‌ట్టిన
సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసు కున్నారు. .

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాభివృద్ది, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌నిచేస్తున్నార‌న్నారు. ఏడాది పాల‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా సుపరిపాల‌నలో తొలి అడుగు కార్య‌క్ర‌మాన్నిసీఎం చంద్ర‌బాబు రూపొందించ‌టం జ‌రిగింద‌న్నారు. ఎన్డీయే కూటమి ఏడాది పాలనలో ఇంటింటికి సంక్షేమం అందితే … వైసీపీ పాలనలో ఇంటింటికి మోసం జ‌రిగింద‌న్నారు. వైసిపి పాల‌న‌లో రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదన్నారు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌టంతో పాటు , అభివృద్ది కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఒకేసారి అమ‌లు చేయ‌గ‌లిగిన ఏకైక నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అంటూ కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు, షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు, సూపర్‌ సిక్స్‌ హామీలను అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల‌కు రూ.5ల‌కు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేస్తే…సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు పున‌రుద్ధ‌రించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నాడ‌న్నారు.

అలాగే మ‌హిళ‌ల‌కు ఏడాదికి 3 గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా అందిస్తుండ‌టంతో పాటు, త‌ల్లివందనం ప‌థ‌కం కింద ఇంట్లో ఎంత మంది చ‌దువుకుంటే అంత‌మందికి ప‌దిహేను వేల రూపాయ‌లు ఇవ్వ‌టం జరిగింద‌న్నారు. అదే విధంగా ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేయ‌బోతున్నార‌ని, అలాగే. పీ 4 లింక్ ద్వారా ప్ర‌తి నెల మ‌హిళ‌ల‌కు ప్ర‌తినెల రూ.1500 భృతి ఇచ్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నూతలపాటి నారద, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు గూడపాటి పద్మశేఖర్, పార్లమెంట్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్లమూడి చలపతి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ , టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫైజాన్ , రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ , మాజీ ఎంపీపీ వడ్లమూడి జగన్ , గొల్లపూడి తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు నూతలపాటి శివరాం , మాజీ ఎంపీటీసీ బొర్ర‌ తిరుపతిరావు , 40 డివిజన్ పార్టీ అధ్యక్షుడు పీవీ సుబ్బయ్య , బూత్ కన్వీనర్లు చుండి నరసింహ , లంకా వెంకటేశ్వరరావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here