ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం : యార్లగడ్డ

0
0

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం : యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్ :
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవానికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన బాపులపాడులోని హనుమాన్ నగర్ లో శుక్రవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావ్ ముందుగా హనుమాన్ నగర్ లోని విగ్నేశ్వర ఆలయంలో పూజలు చేసిన అనంతరం హనుమాన్ నగర్ లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాల దరఖాస్తులు సచివాలయంలో తీసుకోవడం లేదని స్థానికులు ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేశారు. స్పందించిన యార్లగడ్డ ఇళ్ల స్థలాల దరఖాస్తులను ఆఫ్ లైన్లో తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు క్యాబినెట్లో తీర్మానం చేశామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు తన సిద్ధంగా ఉన్నానని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను, గత ఏడాది కాలంలో గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దయ్యాల రాజేశ్వరరావు, ఆరుమళ్ళ వెంకటకృష్ణారెడ్డి, చిరుమామిళ్ల సూర్యం, పుట్టా సురేష్, ముల్పూరి సాయి కళ్యాణి, గుండపునేని ఉమా ప్రసాద్, చింతల వెంకట శివ అప్పారావు, చిన్నాల చిన్నా, దుట్టా శ్రీమన్నారాయణ, అట్లూరి శ్రీను, గార్లపాటి రాజేశ్వరరావు, వేగిరెడ్డి పాపారావు, పొట్లూరి బెనర్జీ, మాదల శ్రీను, వల్లూరుపల్లి నాని, కుమ్మారెడ్డి రాజేష్, అక్కినేని గోకుల్, దన్నే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here