భూ సమస్యలు, ఇతర సమస్యలపై తరలివచ్చిన అర్జీదారులు• వారి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసి

1
0

03.07.2025

భూ సమస్యలు, ఇతర సమస్యలపై తరలివచ్చిన అర్జీదారులు
వారి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసి నేతలు ప్రభుత్వ సలహాదారు MA షరీఫ్, వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకోసం దరఖాస్తు చేసుకోగా జక్కంపూడి టిడ్కో హౌస్ లో ఇళ్లు మంజూరు అయ్యాయని.. అయితే తరువాత వచ్చి వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లపై సప్తగిరి బ్యాంక్ లో లోన్ తీసుకొని.. తమకు ఇళ్లను ఇవ్వలేదని.. నేడు ఆ బ్యాంకు నుండి నోటీసులు వస్తున్నాయని… ఆ నోటీసులు ఎందుకు వస్తున్నాయో తమకు తెలియడంలేదని.. దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని విజయవాడకు చెందిన పలువురు మహిళలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు MA షరీఫ్, వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

• అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన పీట్ల చిన్నయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన భూమిని వైసీపీ వారు కబ్జా చేయాలని చూస్తున్నారని.. వారికి అధికారులు కూడా సహరిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని.. దయ చేసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• తిరుపతిలో స్థానికంగా నివాసం ఉంటూ.. తిరుమలలో వివిధ వ్యాపార సముదాయాలకు, హోటళ్లకు తాము పూలను సరఫరాచేస్తూ జీవనం సాగించేవాళ్లమని.. అయితే గత కొంత కాలంగా అలిపిరి టోల్గేట్ వద్ద విజిలెన్స్ వారు తమ పూలను పైకి వెళ్లనివ్వకుండా అనుమతి నిరాకరిస్తున్నారని.. దాంతో తమ జీవనోపాధికి ఇబ్బందిగా మారుతుందని.. దయ చేసి సమస్యను పరిష్కరించాలని తిరుపతి పూలవీధికి చెందిన పలువురు మహిళలు గ్రీవెన్స్ లో అర్జీఇచ్చి వాపోయారు.
• ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొట్లూరి పద్మజారాణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కబ్జాదారులు తన భూమిని కబ్జా చేసి తనను చంపుతామని బెదిరిస్తున్నారని.. తనను బెదిరిస్తున్న సత్యానారయణ, రామాంజనేయులపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.
• తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకవారి పల్లి గ్రామానికి చెందిన టి. విజయమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా.. అక్రమ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని.. దయ చేసి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• గుంటూరు జిల్లా గుంటూరుకు చెందిన దర్శి జాన్సి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కొండమంజులూరు గ్రామంలో తన తల్లిగారిపేరుమీద ఉన్న భూమిని శరత్ చంద్రమౌళి అనే వ్యక్తి ఆక్రమించి తమపై గొడవలకు వస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకొని తమ భూ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here