ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘం స్వర్ణకారులు..
వన్ టౌన్ లోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘం స్వర్ణకారులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సుజనా ఫౌండేషన్ ద్వారా తమ నాలుగు అంతస్తుల భవనానికి రూ 10 లక్షలతో లిఫ్టు ఏర్పాటు చేసినందుకుగాను ఆ సంఘం అధ్యక్షుడు కేసనం భావన్నారాయణ ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంల
పత్రికా ముఖంగా స్వర్ణకారులు కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు 8000 మంది స్వర్ణకారులు గల స్వర్ణకార సంఘం భవనానికి లిఫ్టు లేకపోవడంతో ఎన్నికల సమయంలో సుజనా చౌదరి కు తమ ఇబ్బందులు తెలియజేశామన్నారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా లిఫ్టు ఏర్పాటు చేస్తానని సుజనా హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని అన్నారు ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ లిఫ్టు కు శంకుస్థాపన చేశారన్నారు.
స్వర్ణకారులు అందరి తరపున
శ్రీ కామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసనం భావన్నారాయణ ఆయన బృందం కృతజ్ఞతలు తెలిపారు
త్వరలో ఎమ్మెల్యే సుజనా చేతుల మీదుగా లిఫ్టు ని ప్రారంభిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ మందరపు పోతులూరి ఆచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ టీ భాస్కర్, వర్కింగ్ కోశాధికా అవ్వారు బుల్లబ్బాయి , కోశాధికారి సలీం, ఉపాధ్యక్షులు ముంత శ్రీను, భద్రం, నరసింహారావు, గోల్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు