2-7-2025
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని స్థానికంగా ఉన్న డ్రైనేజి, ఇతర సమస్యలు వెంటనే పరిష్కార ఉంచాలని అధికారులు కు సూచించిన -MLA బొండా ఉమ
ధి:2-7-2025 ఉదయం NDA కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము 27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్, రజక కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న రజిక వీధి నుండి బూత్ నెంబర్ 212, 213 నందు మరియు 62వ డివిజన్ 62వ బూత్ నందు ప్రజల ఇంటింటికి తెలుగుదేశం అవగాహన సదస్సు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పాల్గొని ఇంటింటికీ వెళ్లి NDA కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన గురించి ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగినది
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 4వ సారి ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు అని, ఏడాది పాలనలో NDA కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించేలా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రజలకు చేసిన మేలు చేయబోయే పనులు ప్రజలకు వివరించి వారి ప్రజా విశ్వాసం పొందేలా కార్యాచరణ రూపొందించుకుంటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారధుల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు ప్రతి ఒక్కరూ ప్రజల ఇంటి వద్దకే వెళ్లి MY TDP యాప్ ద్వారా ప్రజల నుండి అభిప్రాయాలను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్నామని
సెంట్రల్ నియోజకవర్గంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు రూ.240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని MLA బొండా ఉమ తెలిపారు
సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2.60 లక్షల ఓటర్లను కలసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ను వివరిస్తామని, ప్రజల మధ్యే ఉంటూ, వారి మద్దతుతో సుపరిపాలనను కొనసాగిస్తామని తెలియజేసారు
ఈ కార్యక్రమంలో:- నియోజకవర్గ కోఆర్డినేటర్ 27వ డివిజన్ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు, నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, ఘంటా కృష్ణమోహన్, 27 వ డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజు, ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి సురేష్, మద్దల రుక్మిణి, బత్తుల శివ, బండారు కొండ, ఎర్రంశెట్టి శ్రీను, SK బాబు, కొండపల్లి రూప్ కుమార్, కొండపావులూరి బాబు, మంటాడ శివ, P నారాయణ, శ్రీధర్, డిమార్ట్ రమణమ్మ, ఒర్సు మస్తాన్, గుడివాడ దీపక్, అశోక్, విజయ వాణి, 62వ డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, ఇంచార్జ్ పైడి శ్రీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ప్రధాన కార్యదర్శి మరియ బాబు, 62 బూత్ ఇంచార్జ్ జగడం రామలక్ష్మి, రైతు మంగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ బత్తుల కొండ, కో క్లస్టర్ తొట్టెంపూడి ఉదయ్ శంకర్, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.