ఎన్డీఏ కార్యాలయంలో
కూటమి నేతలతో కలిసి
ఎల్.ఓ.సీ అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక
కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్,
ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను బుధవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కూటమి నేతలతో కలిసి
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
49 వ డివిజన్ కు చెందిన
డీ మల్లీశ్వరి వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
రూ 4 లక్షల
ఎల్ ఓ.సీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు
అదేవిధంగా 37 వ డివిజన్ కు చెందిన గోనుగుంట్ల రమేష్ బాబు ( 61) గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా
రూ 1 లక్ష 50 వేల ఎల్.ఓ.సీ అందించారు.
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సారేపల్లి రాధాకృష్ణ, కొమర కిరణ్,అజీజ్, బ్రహ్మారెడ్డీ, భాను, గడ్డిపాటి కిరణ్, సుజనా మిత్రా కోఆర్డినేటర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.