ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏడాది పాలన ప్రతి అడుగు ప్రగతి వైపే సుజనా ఫౌండేషన్ చొరవతో విద్యా, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి

2
0

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏడాది పాలన

సుజనా ఫౌండేషన్ చొరవతో విద్యా, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి

ప్రతి అడుగు ప్రగతి వైపే

రాజకీయాలకతీతంగా సేవలు

నిత్యం అందుబాటులో ఎన్డీఏ కార్యాలయం

కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా తమ సేవలందించిన సుజనా చౌదరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 47 వేల 32 ఓట్ల అత్యధిక మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే !

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సుజనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

సుజనా చౌదరి ఏడాది పాలనలో పేదలకు గుదిబండలుగా మారిన విద్య ,వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలు , ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విషయంలో మౌలిక సదుపాయాల కల్పనకు మార్గదర్శకంగా సుజనా ఫౌండేషన్ ద్వారా బాటలు వేస్తూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

పశ్చిమ పరిధిలో పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ నేనున్నాననే భరోసాను సుజనా చౌదరి కల్పిస్తున్నారు.
రాజకీయాలకతీతంగా పాలన అందిస్తూ పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తి సుజనా చౌదరి.
ఎమ్మెల్యేగా గెలుపొందిన
అనతి కాలంలోనే విశేష సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు.

సొంత నియోజకవర్గం పశ్చిమ కోసం తన మానస పుత్రిక అయిన సుజన ఫౌండేషన్ ద్వారా ఉద్యోగమేళాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

సుజనా ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు.
ఆరోగ్య సంరక్షణలో ముందస్తు రోగ నిర్ధారణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఎమ్మెల్యే సుజనా
రెండు మొబైల్ మెడికల్ బస్సులను ఏర్పాటు చేసి మెరుగైన చికిత్సలను అందించడానికి సిద్ధమయ్యారు.
ముందస్తు రోగనిర్ధారణ పరీక్షల వలన హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్, గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ల పరీక్షలను మరియు ఎక్స్‌రే, 2డీ ఏకో, ఈసీజీ , కంటి, డెంటల్ వంటి తదితర పరీక్షలను ఉచితంగా చేసి పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు.

ప్రజలకు మరింత సేవ చేయడం కోసం సుజనా మిత్రా
కో– ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి వారిచే సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తున్నారు.
గత వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకున్న సుజనా తొలి ఏడాదిలో పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1500 కోట్లతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాజెక్టుల అమలుకు శ్రీకారం చుట్టారు.
బుడమేరు వరదల సమయంలో నేనున్నాననే భరోసా కల్పిస్తూ 12 రోజులపాటు రెండు లక్షల మంది వరద బాధితులకు నిరంతరం ఆహారాన్ని, తాగునీటిని, వైద్య సదుపాయాలను కల్పించారు.
విద్యార్థులు ఆకలితో ఉండకూడదని ఆయన ప్రారంభించిన సుజనా విద్యాన్న పూర్ణ పథకం కబేళాలోని జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు వరంగా మారింది.186 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందించడంతో ఆ కళాశాలలో ఉతీర్ణత శాతం పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే సుజనాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మత్తు పదార్థాల వినియోగ నియంత్రణపై నేటి యువత చైతన్యవంతం కావాలని అప్పుడే నవ సమాజ నిర్మాణాన్ని స్థాపించవచ్చని నమ్మిన వ్యక్తి సుజనా చౌదరి,
సుజనా ఫౌండేషన్ ద్వారా క్రిస్ప్, ఎం.పీ.వై.ఎం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అవగాహన సదస్సులను నిర్వహించి విద్యార్థిని విద్యార్థులను చైతన్య పరుస్తున్నారు.
అంతేకాకుండా అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు సైతం డ్రగ్ అవేర్నెస్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా అంగన్ వాడి కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు సుజనా ఫౌండేషన్ నడుం బిగించింది. క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో వసతులను మెరుగుపరుస్తూ పిల్లలకు, మహిళలకు మెరుగైన వైద్య సేవలు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు .

పశ్చిమ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం తో పాటు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీ. ఆర్. ఐ. ఎస్. పీ) సోషల్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) వంటి దేశంలోనే పేరొందిన సంస్థలతో విద్య, ఆరోగ్యం మెరుగుపరచడంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.

దుర్గమ్మ అనుగ్రహంతో విజయం సాధించిన సుజనా చౌదరి ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు దుర్గమ్మ గుడి అభివృద్ధికి విజన్ 2029 కింద 21 కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
ఆలయంలో మల్టీ లెవెల్ పార్కింగ్, ప్రధాన రహదారి విస్తరణ, బస్ టెర్మినల్, భక్తుల గెస్ట్ హౌస్, యాత్రికుల విశ్రాంతిభవనం, అన్నప్రసాదం పోటు, కళ్యాణ మండపం, శుద్ధమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి మరెన్నో మౌలిక సదుపాయాల కల్పనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ వారిచే బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అంతేకాకుండా త్వరలో పశ్చిమలో రూ.1033 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్యచరణను రూపొందించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా విజన్ 2047 వైపు అడుగులు వేస్తూ ప్రధాని మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో పశ్చిమాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

శాసనసభలో సైతం సుజనా చౌదరి స్థానిక సమస్యలపైనే కాక..రాజధాని అమరావతి రైతుల సమస్యలపై గళం ఎత్తారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చి త్యాగం చేసిన అమరావతి రైతులకు సత్వర న్యాయం జరగాలన్నారు. అమరావతిని భవిష్యత్తులో కదిలించకుండా బలీయమైన చట్టాన్ని రూపొందించాలని శాసనాభాలో సుజనా చేసిన సూచనలను NDA ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. రాజధాని రైతులకు ఇప్పటివరకు జరిగిన నష్టంపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత వైసీపీ హయాంలో వందలాది రోజులపాటు రాజధాని ప్రాంత వాసులు, అక్కడి మహిళలు చేసిన ఉద్యమం తననెంతో కదిలించిందని శాసనసభలో సుజనా చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని రాష్ట్రమంతా ప్రశంసించింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాను ముంచెత్తిన బుడమేరు వరదల సమయంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచిన సుజనా..వరదలు ముగిసిన అనంతరం జరిగిన శాసనసభ సమావేశాలలో సైతం భవిష్యత్తులో వరదలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి శాసనసభలో ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పాటు విజయవాడ నగరంలో డ్రైనేజి వ్యవస్థ నిర్వహణలో పాటించాల్సిన చర్యల గురించి శాసనసభలో స్పష్టంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here