ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : యార్లగడ్డ

0
0

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : యార్లగడ్డ
గన్నవరం:
ప్రజా సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. నియోజకవర్గం కేంద్రమైన గన్నవరం గౌడపేటలో బుధవారం ఉదయం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడపేట లో పర్యటించిన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల పై గుంటలు పుడ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ సంవత్సరకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి 20వేల కిలోమీటర్ల రోడ్లను బాగు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దుచేసి ప్రజలకు పోరాట కలిగించిన సంగతి గుర్తు చేశారు. 8.50 లక్షల మంది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 13.5 వేల కోట్లు చెల్లించామన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముందుగా పాత గన్నవరం లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో యార్లగడ్డ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, టిడిపి టౌన్ పార్టీ ప్రసిడెంట్ జస్థి శ్రీధర్, బి ఎలా ఏ లు మోదుగుముడి వేణు, మోదుగుముడి సత్యనారాయణ, యూనిట్ ఇన్ ఛార్జ్ పల్లగాని కోటి, ఆళ్ల గోపాలకృష్ణ, మేడేపల్లి రామ, బోడపాటి రవి, కొమ్మరాజు సుధీర్, దయ్యాల రాజేశ్వరరావు, గొడ్డళ్ళ చిన్న రామారావు, అల్లా గోపాల కృష్ణ, పడమటి రంగారావు, పొదిలి లలిత, మూల్పూరి సాయి కళ్యాణి పరుచురి నరెష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here