1-7-2025
MLA బొండా ఉమ సొంత నిధులతో 10వ తరగతిలో 583 మార్కులు సాధించిన పేద విద్యార్థినికి ₹5000 రూపాయలు మరియు క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మహిళలకు ₹5000 రూపాయలు ఆర్థిక సహాయం
ధి:1-7-2025 మంగళవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ “G” బ్లాక్ నందు అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ నందు “అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ ఫౌండర్ కొవ్వాడ. వెంకట నారాయణ 66వ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు మరియు క్యాన్సర్ బాధితులకు చికిత్స నిమిత్తం నగదు అందజేయడం జరిగినది
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ ఫౌండర్ కొవ్వాడ. వెంకట నారాయణ స్థాపించిన ఈ సంస్థ ద్వారా ఎంతో మంది వృద్ధులకు వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం సేవలు అందిస్తుందని
ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలలో భాగంగా ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు ఆ ఒక్క రోజు భోజనం, ఫ్రూట్స్ పంపిణీ, దుప్పట్లు, అందజేస్తున్నారని
ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో మంచి పేరుని, సేవా గుణాన్ని పెంపొందించుకోవచ్చు అని, తమ కుటుంబం కూడా ఎప్పుడు కార్యక్రమాలకు ఈ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలోనే జరుపుకుంటామని, వీరికి ప్రభుత్వపరంగా ఇటువంటి అవసరం వచ్చిన తనను సంప్రదించాలని, వీరికి తన తోచినంత సహాయాన్ని ప్రభుత్వపరంగా తనపరంగా కూడా అందిస్తానని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థ యాజమాన్యాన్ని అభినందించి, ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లలు ఉన్నత విద్యన అభ్యసిస్తున్నారని వారు మంచి మార్కులతో పాస్ అవుతున్నారని, పలువురు పేద విద్యార్థులకు సంస్థ ద్వారా బహుమతి నగదును అందజేయడంతో పాటు, తన సొంత నిధుల నుండి కూడా అందించడం చాలా సంతృప్తిని కలగజేస్తుందని, క్యాన్సర్ పేషెంట్లు ను కూడా చికిత్స నిమిత్తం తన వంతు సహాయం అందిస్తానని వారికి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలని ఇప్పటికే క్యాన్సర్ హాస్పటల్ కి సిఫార్సు చేశానని బొండా ఉమా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో:- కంచి ధన శేఖర్,బుగత శ్రీరాములు, మల్లేశ్వరరావు, రామరాజు, బేవర సూర్య, కంచేటి నాగరాజు, పద్మ, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అన్నపూర్ణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.