రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : యార్లగడ్డహనుమాన్ జంక్షన్ : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలో శనివారం సాయంత్రం ఏలూరు కాలువ కాకులుపాడు ఛానల్ వద్ద కృష్ణా జలాలకు పూజలు చేసిన యార్లగడ్డ కాకులపాడు ఛానల్ కు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు ఆలస్యంగా విడుదల చేయడంతో వరి సాగు ఆలస్యమై పంటల సక్రమంగా పడటం లేదని, దీనికి తోడు పంట చేతికందే సమయంలో వస్తున్న తుఫానుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని దీన్ని నివారించి రైతాంగానికి మేలు చేసేందుకు ఈ ఏడాది ముందుగానే కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల చేసినట్లు చెప్పారు. సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని ఆకాంక్షించారు. గ్రామంలోని పేద మహిళలకు వైద్య చికిత్స నిమిత్తం యార్లగడ్డ సొంత నిధుల నుంచి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు, డిసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, వైస్ చైర్మన్ గోపాలకృష్ణ, టిడిపి నాయకులు దయ్యాల రాజేశ్వరరావు, చిన్నాల చిన్నా, వేగిరెడ్డి పాపారావు, మున్నంగి బాబురావు, చలసాని శ్రీనివాస్, బేతాళ ప్రమీల రాణి, సర్పంచులు కాటూరి విజయభాస్కర్, యజ్జవరపు రంగారావు తదితరులు పాల్గొన్నారు.