సురక్షా 360 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత

2
0

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.

            *తేదీ.28-06-2025.*

సురక్షా 360 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత

ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలోని ప్రతి ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా సురక్ష డివైన్ ఏర్పాటు… 28 స్టేషన్ అధికారులకు సురక్షా డివైన్ కిట్ అంధజేత

ప్రతి గ్రామం ప్రతి వీధి సి.సి.కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనేది లక్ష్యంగాసురక్షా 360

ప్రజల భద్రత కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ, 64 వార్డులు మొత్తం 1211 చ.కిలోమీటర్లు అంతా నిరంతర సి.సి.కెమెరాల పర్యవేక్షణలో

సి.సి.కెమెరాల ఏర్పాటుకు సహకరించి అంధరికి ధన్యవాదాలు.

సురక్షా 360 అనేది పోలిసింగ్ లో ఒక నూతన అధ్యాయం కొత్త ఒరవడి

ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ భద్రత అంటే కేవలం భరోసా కాదు నిరంతర పర్యవేక్షణ కూడా అంధుకే మొదటి సారి నగరాల నుండి గ్రామాల వరకు 100 శాతం సి.సి.కెమెరాల కవరేజ్ విజయవంతంగా చేసింది.

ఇధి కేవలం తొలి అడుగు మాత్రమే….. ఈ కృషి వెనకాల ధాతల సహకారం ఎన్.టి.ఆర్.పోలీసు సాంకేతిక బృంధం కృషి అభినంధనీయం.

పోలీసు శాఖకు దిశా నిర్ధేశం చేస్తూ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అంధించే సదవకాశాన్ని కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ తరుపున హృధాయపూర్వక ధన్యవాధములు. .నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

ఈ రోజు మాచవరం పోలీసు స్టేషన్ పరిదిలో సుజన ధి వెన్యూ ఫంక్షన్ హాల్ నందు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ రేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ, 64 వార్డులు మొత్తం 1211 చ.కిలోమీటర్లు నగరాల నుండి గ్రామాల వరకు 100 శాతం సి.సి.కెమెరాల ద్వారా కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసిన సురక్షా 360 ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర హోంశాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత ఎన్.టి.ఆర్.జిల్లా ఎం.పి. కేశినేని శివనాద్ (చిన్ని) ఎం.ఎల్.ఏ.లు యలమంచిలి సుజనా చౌదరి బొండా ఉమా మహేశ్వర రావు గద్దె రామ్మోహన రావు శ్రీరామ్ రాజగోపాల్ కోటికలపూడి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశా ఐ.ఎ.ఎస్. డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఇతర పోలీసు అధికారులు, ధాతలు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర హోంశాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనితగారు మాట్లాడుతూ…. సీసీ కెమెరాల ద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది, ఎన్.టి.ఆర్. జిల్లా కమీషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా.. అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు, అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెపుతుంటారు మొబైల్ మన చేతిలో ఉంటే… ప్రపంచం మన చేతిలోనే ఉంధని, అదే మొబైల్ ను మనకు రక్షణగా, అస్త్రంగా వినిగించుకోవాలి, మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది, నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నాం, వాట్సప్ నెంబర్ కు ఒక్క మెసేజ్ చేస్తే పోలీసులు అప్రమత్తం అవుతారు, నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువ అవుతుంది, మోడల్ పోలీస్టేషన్లు జిల్లా మొత్తం విస్తరించాలి, సరక్ష యాప్, సురక్ష డివైన్ వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది, ఇటీవల ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయి, ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించకండి, ఇటువంటి మోసాలను కూడా అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నార, ఏపీలో నేరాలకు చోటు లేదు, ప్రజల భద్రత కోసం ఏపీ పోలిసు శాఖ ,ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్మార్ట్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ తో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. వీఐపీ,వివిఐపిలు ఎక్కువగా ఉండే భద్రత చాలా అవసరం. డ్రోన్లు,సీసీ కెమెరాలతో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగిన అడ్డుకట్ట వేస్తున్నాం అని తెలియజేశారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ… ప్రజల పట్ల పూర్తి బాధ్యత తో పోలీసు శాఖ పని చేస్తుంది, ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బంది ఉన్నా స్పందించి ముందుకు వస్తాం, మనం చేసే పని దానిని రాష్ట్రం మొత్తం అమలుకావాలనే అంధరికి ఆధార్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు అందరూ సహకరించాలి, మన రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్ధాల రవాణాను చాలా వరకు నియంత్రించాం, పక్క రాష్ట్రాల నుంచి తీసుకు వస్తున్న గంజాయి రవాణాను అరికడతాం, టెక్నాలజీ ద్వారా వారి పై నిఘా పెట్టాం, అస్త్రం యాప్ ద్వారా యన్టీఆర్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయగలిగాం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే గుర్తించి.. పోలీసులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు, హెల్మెట్, సీటు బెల్టు వాడకం ద్వారా చాలా వరకు మరణాలు తగ్గాయి, ప్రమాదాలు జరిగినప్పుడు.. ఇవి లేకపోవడం వల్లే గతంలో మరణాలు ఉన్నాయి, ప్రజలకు చలానాలు కూడా నామాత్రం గా వేసి, వారిలో చైతన్యం తీసుకు వస్తున్నాం, సీసీ కెమెరాల ద్వారా నేరాలను చాలా వరకు తగ్గించగలిగాం, ఎక్కడైనా దొంగతనం, చైన్ స్నాచింగ్ జరిగినా.. వెంటనే గుర్తించి నిందితులను పట్టుకున్నాం, యన్టీఆర్ జిల్లాలో నేడు ప్రతి గ్రామంలో మినిమం నాలుగు కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం, కాలనీల్లో దాతలు కూడా ముందుకు వచ్చి సిసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, ఎమ్మెల్యే సుజనా చౌదరి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముప్పై లక్షల రూపాలు విరాళంగా ఇచ్చారు. పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజాప్రతినిధులు సహకారం అందించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి, అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచేలా డ్రోన్స్ వినియోగిస్తున్నాం, నేడు ప్రతి స్టేషన్ కు ఒక డ్రోన్ ఇచ్చాం.. వాటి ద్వారా మంచి ఫలితాలు సాధించాం, ఇంకా మరో ఎనిమిది డ్రోన్స్ ల ద్వారా ట్రాఫిక్ విభాగానికి అంధించి ట్రాఫ్ఫిక్ నియంత్రణకు ఉపయోగించడం జరుగుతుంది. రౌడీషీటర్లు, కేడీలు, సస్పెక్ట్స్, గంజాయి సేవించే వారు యన్టీఆర్ జిల్లాలో 3400 మంది ఉన్నారు, వారికి సంబంధించిన అన్ని ఆదారాలు , వేలిముద్రలు సేకరించాం, రేపు వాళ్లు ఎటువంటి నేరం చేసినా.. వెంటనే పట్టుబడే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడవద్దని సీఎం సూచించారు,ప్రజల్లో ఉన్న ఆశ ను కొంతమంది ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు, నిన్న అద్విక ట్రేడింగ్ కంపెనీలో 1200 మంది మోసపోయారు, అధిక వడ్డీలు ఆశ చూసి.. ప్రజలు మోసపోవద్దు, అనధికారికంగా చిట్స్ వేసే వారికి ప్రజలు డబ్బులు చెల్లించవద్దు, సురక్ష 360డిగ్రీలు కార్యక్రమాన్ని యన్టీఆర్ జిల్లా పోలీసు కమీషనరేట్ గర్వంగా చెబుతుంది, నేడు యన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం, ఏ మతమైనా ఏ కులమైనా అన్ని ప్రార్థన మందిరాలు కూడా సురక్షితంగా ఉండాలని ఉద్దేశంతో ఈ సురక్ష డివైన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సురక్ష డివైన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఏం.పి. కెసినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ….. ఎన్టీఆర్ జిల్లా లోని ఆలయాలను పరిరక్షించేందుకు డివైన్ సురక్ష తో పాటు, సురక్ష 360 ను ప్రారంభించడం ఆనందంగా ఉంది, రాష్ట్రంలో సామాజిక అవగాహన ఎక్కువ ఉన్న నగరం విజయవాడ, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సహకరిస్తూ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి నగరవాసులు సాయం చేయడం గొప్ప విషయం, పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ప్రూఫ్ కాన్సెప్ట్స్ కి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముందు ఉంది, పోలీసు కమిషనర్ రాజ శేఖర బాబు ఆధ్వర్యంలో స్కూల్స్ మరియు కళాశాలలో సురక్ష విద్య, మార్కెట్ లలో సురక్ష మార్కెట్ రావాలని ఆకాంక్షిస్తున్నాం, అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ ను నేర రహిత ప్రాంతంగా చేయటమే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 30 లక్షల రూపాయలతో నియోజకవర్గ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదాలు అని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ… ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన అంధరికి నా హృధాయపూర్వక ధన్యవాధాలు, సురక్ష 360 డిగ్రీ కార్యక్రమం ఇంత చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ను ఇన్నోవేటివ్ గా చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారు మనం ఏం చేసిన ఇన్నోవేటివ్ గా ఉండాలి, చేసే పని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునేలా ఉండాలని, అదే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని సి.పి. మన జిల్లాను ఒక లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో అలాగే సర్వేలెన్సులో ఆదర్శంగా చేయడానికి చేస్తున్నఈ కృషికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూఉన్నాను దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే దాతలు ఉన్నారో అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జిల్లాని ఒక సెక్యూర్ సేఫ్ జిల్లాగా లా అండ్ ఆర్డర్ పరంగా ఒక స్ట్రాంగ్ జిల్లాగా చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు, ఇక్కడ చేసేదొక ప్రూఫ్ కాన్సెప్ట్ గా ఒక టెక్నాలజి అనుసంధానంతో ఇప్పుడే చూసాం మనం సైబర్ కమాండో, ఇటువంటి కొత్త కొత్త ఆవిష్కరణ చేసి ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తే అది రాష్ట్రానికి కాకుండా దేశానికి ఆధార్శంగా నిలుస్తుంది. మనం రాష్ట్ర మొత్తం ఒక పీస్ఫుల్ సొసైటీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రత్యేకంగా మన సి.పి.రాజశేఖర బాబు కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి హోం మినిస్టర్ మేడం కి ఈ కార్యక్రమంలో మన జిల్లా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఏం.ఎల్.ఏ. మాట్లాడుతూ. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గోవడం చాల ఆనందంగా ఉందని, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తమ పోలీసింగ్ ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఒక నిదర్శనం అన్నారు. ట్రాఫిక్ విషయంలో కూడా మెరుగైన చర్యలతో ట్రాఫిక్ జామ్ కాకుండా, జంక్షన్ల క్రాసింగ్ల వద్ద ఎక్కువ సమయం పట్టకుండా చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుదన్నారు. అధెవిధంగా స్కూల్స్ మరియు కళాశాలలో సురక్షా విధ్యా కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేశారు.

అనంతరం ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ పరిదిలో సి.సి.కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ధాతలను దుశ్శాలువతో సత్కరించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here