28-6-2025
“ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించే విషయాలను పోలీసులకు తెలియజేయాలి – మనమంతా కలిసి పనిచేస్తేనే సమాజాన్ని నేరాల నుంచి రక్షించగలుగుతాం -MLA బొండా ఉమ
ధి:28-6-2025 శనివారం ఉదయం విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా లోని ఆలయాలను పరిరక్షించేందుకు డివైన్ సురక్ష తో పాటు, సురక్ష 360 ను ప్రారంభించిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ MP కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ సనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు MLA లు గద్దె రామ్మోహన్ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సుజనా చౌదరి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లాలోని 29 ఎస్. హె. వో లకు డివైన్ సురక్ష కిట్స్ ను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక అవగాహన ఎక్కువ ఉన్న నగరం విజయవాడ.. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు సహకరిస్తూ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి నగరవాసులు సాయం చేయడం గొప్ప విషయమని, పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ప్రూఫ్ కాన్సెప్ట్స్ కి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముందు ఉందని, సీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సురక్ష విద్య,సురక్ష మార్కెట్ రావాలని
అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నేర రహిత ప్రాంతంగా చేయటమే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 30 లక్షల రూపాయలతో నియోజకవర్గ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసమని
సెంట్రల్ నియోజకవర్గంలో డ్రోన్ల ద్వారా ప్రజలకు రక్షణ కల్పించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్ఞాన దృష్టితో చెప్పారని, ఒక మనిషి వెళ్లలేని చోటికి కూడా డ్రోన్ సహాయంతో పర్యవేక్షించి అక్కడ ఆకతాయిలను నివారించవచ్చని, టెక్నాలజీ మారుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు గాని, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయాలు జరగకుండా చూడవచ్చని, ఈరోజు పెద్ద ఎత్తున దాతల సహాయంతో డ్రోన్లు, సీసీ కెమెరాలను కొనుగోలు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని
నియోజకవర్గంలోని 5 టౌన్ పోలీస్ స్టేషన్ ను LED స్క్రీన్స్ తో అత్యాధునిక వసతులతో నిర్మించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మానిటరింగ్ చేస్తున్నామని, నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా నిత్యం ఒక పక్కన పోలీసులతో, ఒక పక్కన టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నామని ప్రజలకు కూడా చైతన్యం కల్పిస్తున్నామని తద్వారా నేరచరిత్ర గల వారిపై నిఘా పెట్టడం సులభమవుతుంది అని, ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యం నేరాలు, నేరస్థుల బారి నుంచి ప్రతి సామాన్య పౌరుడిని కాపాడుకోవడం కోసం స్మార్ట్ పోలిసింగ్‌తో పాటు సరికొత్త టెక్నాలజీ AI ని వినియోగించుకుంటున్నామని ఈ సీసీ కెమెరాలు నేరస్థులకు భయాన్ని కలిగిస్తాయి, చట్టబద్ధంగా జీవించే ప్రజలకు రక్షణ కల్పిస్తాయని తెలియజేసారు