26-6-2025
ధి:-26-6-2025 గురువారం అనగా ఈరోజు సాయంత్రం 5:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాలు జోలికి వెళ్లవద్దు, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు మత్తు పదార్థాల పై అవగాహన కల్పిద్దాం మత్తు వల్ల నాశనమయ్యే జీవితాలను కాపాడుదాం అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ఈరోజు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలి అని, డ్రగ్స్ లాంటి వ్యసనాలు యువతను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తున్నాయి.
ఈ సమాజాన్ని పట్టిపీడిస్తు ప్రజలని ప్రజలను ప్రధానంగా యువతలు విద్యార్థులలో పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలను నిషేధించాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కోరారు
గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను అరికట్టడంలో, పూర్తిగా వైఫల్యం చెందిందని, గంజాయి, హారాయి న్, కొక్కెన్ లాంటి మాదకద్రవ్యాల వలన అలవాటు పడిన జీవితాలు ప్రజల జీవితాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా, ఆరోగ్యాలు కూడా పాడయ్యి, రోడ్లున పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూసామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత నవ్యాంధ్రప్రదేశ్ గ తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని దీనికి ఎటువంటి వారు అడ్డం తగిలిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిపై నిరంతరం నిరంతరం పోలీస్ వారి దృష్టి ఉంటుందని మాదకద్రవ్యాలు అలవాటు పడినటువంటి వ్యక్తులని వ్యక్తులను హెచ్చరించారు హెచ్చరించారు
ప్రధానంగా యువత విద్యార్థులు ఈ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అటువంటి అలవాట్లు ఉన్నవారు ఎవరైనా ఉంటే తక్షణమే వారి వారి తల్లిదండ్రులకు చెప్పటంతో పాటు, కళాశాలల స్కూల్ ల ఉపాధ్యాయులకు తెలియజేయాలని అన్నారు
ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులపై ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టి ఆయా వ్యాపారాలు నాశనం చేయడమే కాకుండా చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకొని న్యాయస్థానాలలో శిక్షపడేట్టు బాధ్యత తీసుకుంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ఘంటా కృష్ణమోహన్ లతో పాటు నాయకులు కార్యకర్తలు మహిళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు