విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని స్థానిక పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి )కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు

2
0

దుర్గమ్మ సేవలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని స్థానిక పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి )కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు

ఆలయ ఈఓ సీనా నాయక్ అధికారులు మరియు కూటమి నేతలు వారికి ఘన స్వాగతం పలికారు .
అమ్మవారి దర్శన అనంతరం
వేద పండితులు
వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రం , ప్రసాదం , చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని, కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని, విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నానని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు .
ప్రజలకి సేవ చేయడానికి మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

సుజనా వెంట టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ గౌరవాధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, కార్పొరేటర్ బుల్లా విజయ్ , యేదుపాటి రామయ్య, తిరుపతి సురేష్, తిరుపతి అనూష,షేక్ సలీం, అబ్దుల్ ఖాదర్, మైలవరపు కృష్ణ, దుర్బేసుల హుస్సేన్, పోతిన భేసు కంటేశ్వరుడు, రెడ్డిపల్లి రాజు, పైలా సురేష్, బెవర మురళి,మంగళపురి మహేష్, పచ్చవ మల్లికార్జున, బొల్లేపల్లి కోటేశ్వరరావు, దాడి మురళీకృష్ణ,మైనంపాటి రమేష్, దొడ్ల రాజాతదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here