సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 27న విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ ప్రభుజి, పతిత పావన్ దాస్ ప్రభుజి, కృష్ణ ప్రేమ దాస్ ప్రభుజి లతో కలిసి పరిశీలించారు.
ఇస్కాన్ రథయాత్ర 2025 ఊరేగింపులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీతారా లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్న జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ ప్రభుజి తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలను సూచనలు అందించారు. పకడ్బంది ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ పోలీసులను కోరారు.