సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని

3
0

25-06-2025

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
30 మంది ల‌బ్ధి దారుల‌కు రూ.24 ల‌క్ష‌ల 28 వేల రూపాయాల చెక్కుల అంద‌జేత‌

విజయవాడ : రాష్ట్రంలోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది. అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవాడ‌ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.

గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధ‌వారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.24 ల‌క్ష‌ల 28 వేల రూపాయాల విలువ గ‌ల చెక్కులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిన లేఖను లబ్ధిదారుల‌కు ఎంపి కేశినేని శివనాథ్ అందజేయ‌టంతో పాటు ల‌బ్ధిదారులంద‌రితో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

విజ‌య‌వాడకి చెందిన య‌ర్రం శెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావుకి క్యాన్స‌ర్ వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.8 ల‌క్ష‌లు, వేమారెడ్డి రామిరెడ్డి రూ.2 ల‌క్ష‌ల 50 వేలు, కె.ల‌క్ష్మ‌మ్మ రూ.ఒక ల‌క్ష ఇర‌వై వేలు, కె.వ‌ర‌ల‌క్ష్మీ రూ.60 వేలు విలువ గ‌ల ఎల్.వో.సి ప‌త్రాల‌ను అంద‌జేయ‌గా, గ‌ద్దె అప్పాయ్య కు రూ.35 వేలు, అల్లా నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కి రూ.44,924 , పి. అచ్చ‌మ్మ కి 46,741, పి.ర‌మ‌ణ‌మ్మ కి 51,795, వాడ‌ప‌ల్లి స‌త్యం కు రూ.68,795, జి.సాయి పూజిత రూ.40,820, స‌య్య‌ద్ బ‌హుద‌ర్ రూ.47, 642, కె.అంజ‌న‌రావు రూ.23,400, కె.రామ‌స్వామి రూ.49, 625, కె.శ్రీదేవి రూ.38,700, ష‌కీలా బేగం రూ.4,21,593, షేక్ అబ్దుల్ న‌బీ రూ.40,350, సామినేని చిట్టెమ్మ రూ.37,378, పి.శ్రీనివాస‌రావు రూ.56,485, తాతా ప‌ద్మావ‌తి రూ.27, 493, గ‌ద్దె వెంక‌టేశ్వ‌ర రెడ్డి 31,377, షేక్ ఆఫియా అంజూమ్ రూ.30,786, పి.నాగ‌రాజు రూ.25,000, బి.పొల‌య్య రూ.60 వేలు, వ‌ల్ల‌భ‌నేని శ్రీల‌క్ష్మీ రూ.45,541, ఎమ్.శంక‌ర‌రావు రూ.61,572, పి.క‌మ‌లాక‌ర్ రూ.25,166, మ‌హ్మ‌ద్ అస్మా రూ.43,786, ల‌క్కిరెడ్డి నాగేంద్ర‌మ్మ రూ.44,048, కె.స్వాతి రూ.70 వేలు, ఆర్.ల‌క్ష్మీ ప్ర‌తిమ రూ.40 వేలు, సి.హెచ్. రామారావు రూ.40 వేలు, కె.స‌త్య‌వ‌తి రూ.40,786 చెక్కుల‌ను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు సుప‌రిపాల‌న‌లో రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా వున్నారన్నారు. ల‌బ్ధిదారుల‌కు స‌కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందే విధంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ సీఎం చంద్ర‌బాబుకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బాధితుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్.వో.సి ప‌త్రాలు అందుతున్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో 145 మందికి దాదాపు కోటి 85 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కులు అంద‌జేయ‌టం జ‌రిగందన్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్
అధ్య‌క్షుడు క‌రీముల్లా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.ఎమ్. ఫైజాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్ (ద‌ళిత‌ర‌త్న‌), టిడిపి నాయ‌కులు సంకె విశ్వ‌నాథం ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here