24-06-2025
ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఘనంగా ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు
20 కేజీల కేక్ కట్ చేసిన ఎంపీ కేశినేని చిన్ని
ఎంపీ కేశినేని చిన్నిను సన్మానించిన నాయకులు,కార్యకర్తలు
విజయవాడ : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గా కేశినేని శివనాథ్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్ 20 కేజీల కేక్ ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో తన ఆనందం పంచుకున్నారు. తనకి ఎంపీ అయ్యేందుకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన విజయానికి కారణమైన ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సాయిచరణ్ యాదవ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, హూడా మాజీ చైర్మన్ టి.ప్రేమనాథ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి రాష్ట్ర నాయకులు గన్నె ప్రసాద్ (అన్న), చెన్నుపాటి గాంధీ, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, టిడిపి సీనియర్ నాయకులు నరసింహాచౌదరి, టిడిపి నాయకులు యెర్నేని వేదవ్యాస్, మాదిగాని గురునాథం, పీతా బుజ్జి, పట్నాల హరిబాబు కొడూరు ఆంజనేయ వాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు.