యోగా మన సంస్కృతి, మన సంపద. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దాం.
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా/నందిగామ టౌన్ : 21 జూన్ 2025.
నందిగామ పట్టణం జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా శనివారం నాడు 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆర్డిఓ బాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ లోవరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి , ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యార్థిని విద్యార్థులు, ప్రజానీకం మరియు అధికారులతో కలసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సామ్య మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను జీవన విధానంగా మలచుకోవాలి 11వ అంతర్జాతీయ యోగా డే దీనికి నాంది పలకలి. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. అలాగే రాష్ట్రంలో వాడవాడలా యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం.వారసత్వంగా వచ్చిన యోగాను మనమంతా ఆచరించటంతో పాటు భవిష్యత్ తరాలకూ అందిద్దాం.