సెంట్రల్ నియోజకవర్గంలోని  సింగ్ నగర్ MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు కూటమి ప్రభుత్వానికి సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తయిన 

3
0

12-6-2025

ధి:12-6-2025 మధ్యాహ్నం 1:00″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని  సింగ్ నగర్ MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు కూటమి ప్రభుత్వానికి సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరు సుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా  పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ , సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విచ్చేసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు , నోట్ బుక్స్ అందజేసి, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలలను, కార్పొరేట్ పాఠశాలల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని

ప్రతి విద్యార్థికి కావలసిన అన్ని రకాల పుస్తకాలు బ్యాగులు, బూట్లు తదితర కిట్లను ప్రభుత్వమే అందిస్తుందని, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని

ఈ కార్యక్రమంలో:- పాఠశాల HM P. వెంకటేశ్వరరావు, విజయ్ కృష్ణా సూపర్ మార్కెట్ డైరెక్టర్  వేల్పుల రాజేష్,డివిజన్ ఇంచార్జి Sk.జాన్ వలి, డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, Sk పర్వీన్, గౌసియా, మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here