Home Andhra Pradesh ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సుజనా చౌదరి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సుజనా చౌదరి

1
0

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సుజనా చౌదరి

ఎన్. టి.ఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ( సుజనా చౌదరి) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తున్నారని ఎన్.టి. ఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. వన్ టౌన్ కి చెందిన నిరుపేదలైన వీ వెంకట లక్ష్మీ కు ఇస్త్రీ బండి, మరియు బ్యాంక్ సెంటర్ కు చెందిన బొర్రా లక్ష్మీ కు టిఫిన్ బండిని శనివారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మరియు కూటమి నేతలతో కలిసి అందించారు.ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుపేదలైన తమకు బండ్లు అందజేయాలని ఎమ్మెల్యే సుజనా ను కోరగా స్పందించిన ఆయన 40 మంది చిరు వ్యాపారస్తులకు జూన్ రెండో తేదీన ఆయన జన్మదినోత్సవం నాడు సుజనా తనయుడు యలమంచిలి కార్తీక్ చేతుల మీదుగా టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, తోపుడుబళ్లను అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారుమిగిలిన లబ్ధిదారులకు శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశామన్నారు. బళ్ళు ఉచితంగా ఇచ్చి మా కుటుంబాలకు ఎమ్మెల్యే సుజనా ఎంతో మేలు చేశారని ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు పశ్చిమ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ విద్యా ,వైద్య ,ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే సుజనా కట్టుబడి ఉన్నారని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య, కే శివశర్మ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, అవ్వారు బుల్లబ్బాయి, బాయన హేరంభ కుమార్, నున్న కృష్ణ, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, కుంచెం శివకుమారి,సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here