- ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసి ఇతర డిగ్రీ కోర్సుల విభాగాలలో ప్లేసెమెంట్స్ లో సత్తా చాటిన
కె ఎల్ విద్యార్థులు - 7 వేల మందికి పైగా కంపెనీ ఆఫర్లు
- 5 వేల మందికి పైగా ప్లేసెమెంట్స్
క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో కె ఎల్ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేసెమెంట్స్ రికార్డు సాధించగా… డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155 కు పైగా కంపెనీలలో ప్లేసెమెంట్స్ సాధించారని యూనివర్సిటీ ప్లేసెమెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు తెలియచేశారు. విజయవాడ లోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాంపస్ ప్లేసెమెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగానే 450 కి పైగా జాతీయ కంపెనీలు, 50 కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేసెమెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేసెమెంట్స్ పూర్తి అయినప్పటికీ మెరుగైన ఆఫర్లు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నతమైన ప్లేసెమెంట్స్ పొందారని చెప్పారు.
వీరందరికీ బ్యాంకు ఆఫ్ అమెరికా, డెలాయిట్, ఐ టి సి, ఆక్సెంచర్, టి సి ఎస్ వంటి 155 కు పైగా కంపెనీలలో 15 వందల మందికి పైగా ఆఫర్స్ వచ్చాయాని, 1087 మంది విద్యార్థులు ప్లేసెమెంట్స్ పొందారని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులలో 10.7 లక్షల సి టి సి ఆఫర్స్ ను తమ విద్యార్థులు దక్కించుకున్నారని చెప్పారు.
యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎం హెచ్ ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కె ఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేసెమెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఇందులో భాగంగా ఇటీవలే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు చెప్పారు. క్యాంపస్ లోనే 15 కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 కంపెనీలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు.
నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, నాణ్యమైన డిగ్రీలతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో విద్యార్థులు ప్లేస్ అయ్యేలా వారిని సిద్ధం చేయటం యూనివర్సిటీ ప్రధాన ఆశయమని వారు తెలియచేశారు.
యూనివర్సిటీ ప్లేసెమెంట్స్ విభాగం అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి పాల్గొన్నారు.