విష్వక్సేన్ కథానాయకుడిగా విద్యాధర్ దర్శకత్వంలో ‘గామి’ సినిమా రూపొందింది. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘నీలోని యుద్ధం శివమ్ .. నీతో నీ యుద్ధం శివమ్ .. నీకై నీ యుద్ధం శివమ్’ అంటూ ఈ పాట సాగుతోంది. ‘నీలో నిను వెదికేది .. నీతో నిను కలిపేది’ అంటూ తేలికైన పదాలతో .. లోతైన అర్థాలతో శ్రీమణి చేసిన ప్రయోగాలు బాగున్నాయి. నరేశ్ కుమార్ సమకూర్చిన బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు.
ఈ సినిమాలో కథానాయకుడు తన సమస్యకి ఒక పరిష్కారం కోసం హిమాలయాలకు బయల్దేరతాడు. తాను అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోకపోతే, ఇక ఎప్పటికీ తాను ఆ సమస్య నుంచి బయటపడలేడు. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.
Spread the love విజయవాడ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసులులలో 17 మందిని నిందితులను అరెస్ట్ చేశాం ఈ 17 మంది నిందితులు నేరచరిత్ర […]
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు ఆదిత్య హృదయం ప్రతినిధిమం తెన గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ కంకిపాడుఈ రోజు(30/04)న మండలంలోని […]
Spread the love 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అప్పుడు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే… మెయిన్స్ జవాబు పత్రాలను […]