లోకేశ్ ను సీఎం చేయడానికి తారక్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారన్న కొడాలి నాని
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ను గోతిలో పాతిపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు బుద్ధి చెప్పాలని కోరారు. నారా లోకేశ్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని చెప్పారు. లోకేశ్ ను సీఎం చేయాలనే దురుద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
పేద ప్రజలకు సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ. 2.50 లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన జగన్ కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని అన్నారు. ఎంత మంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని చెప్పారు. వైసీపీ రెండో సారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Spread the love మూలపాడు,కిలేశపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామస్తులు అత్మీయ స్వాగతం […]
Spread the love పశ్చిమ ప్రజల కలలను నిజం చేస్తా కూటమి గెలుపు చారిత్రక అవసరం సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి కొండ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నిజం […]
Spread the love తెనాలి లో సంచలన ఘటన ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థి అన్నా బత్తుని శివకుమార్.. ఓటరు ని కొట్టిన ఎమ్మెల్యే .తిరిగి ఎమ్మేల్యేను కొట్టిన ఓటరు…క్యూలైన్లో ఓటేసే విషయంలో ఈ ఘటన.ఘటనను […]