*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.* తేది.31.05.2025.
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు.
సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయం.ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం.hపోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు.అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.*ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ది.31.05.2025 తేదిన పదవీ విరమణ చేసిన 08 మంది పోలీస్ అధికారులను పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఇతర పోలీస్ అధికారులతో కలిసి సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవీ విరమణ చేసిన అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.*పదవీవిరమణ పొందిన వారి వివరాలు :**క్ర.సం* *పేరు* *హోదా* *విధులు నిర్వహణ*(1) శ్రీ సి.హెచ్.శ్రీనివాస రావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సి.ఎస్.బి. (2) శ్రీ బి.ఈ.వేంకటేశ్వర రావు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జగ్గయ్య పేట(3) శ్రీ ఎస్.సత్యనారాయణ రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ సి.ఏ.ఆర్.(4) శ్రీ కె.వి.ఎల్.నారాయణ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ పటమట పి.ఎస్. (5) శ్రీ సయ్యద్ రియాజుద్దీన్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ రెండవ ట్రాఫిక్ పి.ఎస్.(6) శ్రీ సి.హెచ్.వేంకటేశ్వర రావు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ తిరువూరు. (7) బక్కా శ్రీనివాస రావు హోంగార్డు సౌత్.ఎ.సి.పి. ఆఫీసు (8) కొల్లూరి నాగేశ్వరి హోంగార్డు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ. పి. ఎస్. ఎ. ఓ. సునీత ఎ. ఆర్. ఎ.సి.పి. డి. ప్రసాదరావు వెల్ఫేర్ ఆర్.ఐ శ్రీనివాసరావు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సోమయ్య, అసోసియేషన్ సంఘ సభ్యులు మరియు అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.