కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పపై లైంగిక దాడి ఆరోపణలతో తాజాగా కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సోచట్టం, ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద యడియూరప్పపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగింది. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సాయం కోసం వెళితే ఇలా జరిగిందని బాధిత బాలిక, ఆమె తల్లి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
![]()

