గత వారం రోజులుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పుత్తడి ధరలు నేడు ఓ మోస్తరుగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 260 పెరిగి రూ. 60,619కి చేరుకుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన (24 కేరెట్లు) బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 66,619కి చేరుకుంది. వెండి ధర రికార్డు స్థాయిలో కిలో రూ. 80,100 చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ గత వారం రోజులుగా పుత్తడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వేల వద్ద ఊగిసలాడింది. 22 కేరెట్ల ధర రూ. 55 వేలకు అటూఇటుగా రూ. 55 వేల వద్ద కదలాడింది. ఇప్పుడు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. అంటే.. నిన్నటి క్లోజింగ్ ధరలు. వీటిలో ఏ క్షణాన అయినా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కొనుగోలుదారులు అప్పటి రేట్లను తెలుసుకోవాల్సి ఉంటుంది.
Spread the loveశబరిమల – రోజుకు 90 వేల మంది భక్తులకు అనుమతి..!! మండల మరియు మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు సమావేశం నిర్ణయించింది. […]
Spread the love బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల […]
Spread the love రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వైనం ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం మృతదేహాన్ని భారత్‌కు […]