ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిల్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది.
లిక్కర్ కేసులో గత ఏడాది మార్చిలో ఈడీ ముందు విచారణకు కవిత పలుమార్లు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే సాక్షిగా సీబీఐ విచారించింది. అయితే సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా మారుస్తూ విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్పీసీ 41ఏ కింద సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐల ముందు విచారణకు హాజరు కావాలా? లేదా? అనే విషయం ఈరోజు తేలపోనుంది. ఈరోజు జరిగే సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
Spread the love గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రాజీవ్ వైఎస్ఆర్ తాడిగడప* -ఈ రోజు(07/05)న పట్టణంలోని సనత్ నగర్ నందు ఇళ్లను సందర్శిస్తూ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ […]
Spread the love విజయవాడ నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం బట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశం […]
Spread the love కొత్తూరు తాడేపల్లి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం లో భాగంగా సోమవారం రాత్రి గ్రామస్తులు అపూర్వమైన ఆదరణ చూపి అత్మీయ […]