అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికాసమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ (అరుణాచల్ ప్రదేశ్) మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సైన్యాలను సరిహద్దులకు తరలించేందుకు సర్వకాలాల్లోనూ అందుబాటులో ఉండే ఈ టన్నెల్‌కు భద్రతాకారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా తమ భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది.
మరోవైపు, చైనా ప్రకటనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది.
Spread the love రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా […]
Spread the love వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోజ్… లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే […]
Spread the love వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగనున్నారు. అయితే, తాజాగా ట్రంప్ సంచలన […]