సినీ నటి సోనును అరెస్ట్ చేసిన పోలీసులు

Spread the love

 


కన్నడ సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సోను శ్రీనివాసగౌడను బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తర కర్ణాటకు చెందిన ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్నానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలికకు ముక్కు కుట్టించడం, భోజనం పెడుతున్న వీడియోలను అప్ లోడ్ చేసింది. దత్తత నిబంధనల ప్రకారం ఎవరిని దత్తత తీసుకున్నాం, ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నాం అనే వివరాలను బయటకు వెళ్లడించకూడదు. అయితే, ఇంట్లో పనులు చేయించేందుకు అమ్మాయిని ఆమె తీసుకువచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య మిలియన్ వరకు ఉంది. గతంలో ఆమె మాల్దీవులకు వెళ్లినప్పుడు బికినీ ఫొటోలు షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెకు పాప్యులారిటీ బాగా పెరిగింది. వేలల్లో ఉన్న ఫాలోయర్లు లక్షల్లోకి వెళ్లారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *